టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయన’ని చేసిన ప్రకటన పట్ల ఆ పార్టీ ముఖ్యనేతలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. దీన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి చర్య తీసుకోవాలని కోరుతామంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయననటం పెద్ద తప్పేమీ కాదు కదా? అని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరిని ఆరా తీయగా, అది జగ్గారెడ్డి వ్యక్తిగత ప్రకటనగా కాకుండా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని పరోక్షంగా హింట్ ఇచ్చినట్టుగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరైనా కార్యకర్తను నిలబెట్టనున్నట్టు జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
– వెల్జాల