నిన్నటి స్వప్నమే నేడు సాకారం
నేటి తెలంగాణ విజయమే
రేపటికి స్ఫూర్తిదాయకం
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి
దివిటీ ఎత్తిన తెలంగాణ
ప్రతి గుండెను తట్టిలేపిన
స్ఫూర్తిమంత్రం
నాటి వలసపాలకుల పాలనలో
వట్టిపోయిన తెలంగాణ
నేడు ఊరూరా జలకళతో
పచ్చబడ్డ హరితహారం
పాలనలోనూ పథకాల్లోనూ
ఉద్యమబాటను వీడని ధీరత్వం
పాలకుల నిర్విరామకృషికి
అకుంఠిత దీక్షకు నిదర్శనం
కరువుకోరల్లో తల్లడిల్లిన పల్లెలు
నేడు పచ్చదనాన్ని సింగారించుకుని
పరిమళిస్తున్న ప్రగతికాంతులు
నీళ్ళులేక పడావుపడ్డ భూములన్నీ
కళకళలాడుతున్న ప్రాజెక్టులతో
హరితస్వప్నాన్ని నిజంచేసిన వైనం
కాలంతో పరుగెడుతూ
ప్రగతిపథాన్ని కాంక్షిస్తూ
ప్రభాతగీతమై పల్లవిస్తున్న
విజయనాదం
రేపటి భావితరానికి అందిస్తున్న
హామీపత్రం
కాలం నుదుటిపై లిఖిస్తున్న
వెచ్చని సంతకం
–డా. భీంపల్లి శ్రీకాంత్, 903240017