సీ:
కాళేశ్వరమునీరు! కాల్వలై పారగా
పుడమితల్లిమేను! పులకరించె
పాడిపంటలతోడ! పసిడికాంతులతోడ
పరవశమ్మొందిరి! ప్రజలు నేడు
అన్నదాతలకెల్ల! ఆనందమును గూర్చు
వరదాయినిగనయ్యె! వసుధలోన
సాగుజేయగభూమి! సస్యశ్యామలమయ్యె
సంబరమ్మదినంటె! నంబరమును
తే.గీ:
అన్నివృత్తులకాధారమెన్ననీవె
నీరులేకున్న ప్రాణంబునిముషమైన
నిలువబోదని నిలుపగావెలసినట్టి
గరళకంఠుడు దింపినగంగనీవు!
ఉ:
నీటిని నిల్వజేయుటకు నిండగ చెర్వులుకుంటలన్నియున్
పాటుకు వాలుకట్టలును వర్షము నీరటనింకజేసెగా
దీటుగ పూర్వవైభవము దెచ్చెను ధీరభగీరతుండునై
మేటియె కేసియారు ప్రజమేలును గోరెడి ముఖ్యమంత్రియై!
–ఊర ఈశ్వర్రెడ్డి, 7981497017