ఆంధ్ర అంధకారంలో
ఆదిత్య ప్రకాశంలా
ఆవిర్భవించె తెలంగాణం
॥ఆంధ్ర॥
మడిమ తిప్పని యోధుడు
పుడమి పులకిత పుత్రుడు
మహానేత కేసీయార్
అహో అద్భుతమ్ముగా
పండించగ ప్రతి మాగాణం
సాధించెను నవ తెలంగాణ
॥ఆంధ్ర॥
అపర భగీరథుడిగా
ప్రజల మనోరథం తీర్చ
కాళేశ్వర ప్రాజెక్టుతో
మరలించెను గోదావరి
తపియించగ చేలో వరి
తరలించెను మహాఝరి
॥ఆంధ్ర॥
సస్యశ్యామలమ్ముగా
తెలంగాణ మెల్ల తీర్చి
ప్రజా సంక్షేమమ్ముగ
పథకాలెన్నో కూర్చి
అనితర సాధ్యమ్ముగా
అఖండ విద్యుత్తుతో
రాజుకున్న జ్వాలలా
రాజకీయ విద్వత్తుతో
ఎదురులేని నాయకునిగ
ఎనిమిదేండ్ల పాలనతో
కేలెత్తెను మన కేసీఆర్
బెంబేలెత్తెను ప్రతిపక్షం ‘వార్’
॥ఆంధ్ర॥
– డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ , 92465 41699