మత ఘర్షణల వెనుక వ్యాపారం
తెలుగు సాహిత్యంలో ‘దళిత సాహిత్యం’ తనదైన ముద్రతో ముందుకువచ్చింది. కులవివక్ష, అణచివేతలను తీవ్ర స్వరంతో నిరసించింది. జీవితంలోని సకల పార్శాలలో కులం ఎలా ప్రభావం చూపుతున్నదో అనేకమంది కవులు, రచయితలు తమవైన అనుభవాలను చెప్తూ దళిత సాహిత్యానికి జవజీవం పోశారు.
తెలుగు సాహిత్యంలో ‘దళిత సాహిత్యం’ తనదైన ముద్రతో ముందుకువచ్చింది. కులవివక్ష, అణచివేతలను తీవ్ర స్వరంతో నిరసించింది. జీవితంలోని సకల పార్శాలలో కులం ఎలా ప్రభావం చూపుతున్నదో అనేకమంది కవులు, రచయితలు తమవైన అనుభవాలను చెప్తూ దళిత సాహిత్యానికి జవజీవం పోశారు. తెలుగు సాహిత్యాన్ని సారవంతం చేశారు.
ప్రముఖ కవి సతీష్‌చందర్ ‘పంచమ వేదం’ కవితలో ఈ విధంగా ప్రశ్నించాడు.. ‘పంచముడంటే అయిదోవేలు లేనివాడనే నా అర్థం, మా ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు’. ఎండ్లూరి సుధాకర్ ‘మల్లెమొగ్గల గొడుగు’ అనే దళితుల ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని చిత్రంచే కథల సంకలనం తెచ్చాడు. ‘పాదముద్రలు’ అనే కవితలో ఎండ్లూరి సుధాకర్.. ‘నేను బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని, నన్నెవ్వరూ ఆపలేరు’ అంటాడు.‘ఈ భూమ్మీద పుట్టిన మూలవాసులు దళితులు’ అని మాస్టార్జీ ఈ విధంగా అంటాడు.. ‘ఈ దేశ వాసులం,ఆ భూమిపుత్రులం మేం మూలం వాసులం, ఆది అసలు జాతులం ..’ అనే… ఇటువంటి చారిత్రక సత్యాలు దళితుల ఆత్మగౌరవాన్ని చైతన్యాన్ని ఉద్దీపింపజేస్తున్నాయి. దళితులు రాజకీయాధికారం చేజిక్కించుకున్నప్పుడే దళిత వెతలు తీరుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
దళితులతో బీసీలు చేరి కొన్నాళ్లు ‘బహుజన వాదం’ పేరుతో సాహిత్యం సృష్టించారు. ఆ విధంగా బహుజన వాదాన్ని ముందుకుతెచ్చి రచనలు చేసిన వారు బీఎస్ రాములు, కాలువ మల్లయ్య మొదలైన వారున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నాయకత్వంలో బహుజన సమాజ్‌పార్టీ అధికారంలోకి రావడం, దళిత- బహుజన వాదానికి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్నిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ‘దళిత సంఘర్షణ సమితి’, మహారాష్ట్రలో ‘దళిత్ పాంథర్స్’, తమిళనాడులో ‘దళిత కల్చరల్ ఫ్రంట్’ మొదలైన సంస్థలు దళితవాదానికి ప్రచారాన్ని, స్ఫూర్తినిస్తున్నాయి.
‘ముస్లింవాదం’ మొదట్లో దళిత బహుజన వాదంలో భాగంగానే వ్యక్తమైంది. రానురాను ముస్లిం రచయితలు ఎక్కువ సంఖ్యలో తమ వేదనలను, వివక్షను తమ సంస్కృతి నేపథ్యంలో వ్యక్తీకరించటంతో ‘ముస్లిం వాదం’ స్వతంత్ర రూపం ధరించింది. దీన్నే ‘ముస్లిం మైనారిటీ వాదం’ అని కూడా అంటున్నారు. దేశ జనాభాలో ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారు. దాంతో ‘ముస్లిం మైనారిటీ వాదం’ అన్నారు. కానీ ‘ముస్లిం వాదం’ అనడమే సమంజసం. ముస్లింలను అన్ని రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు ఓటు బ్యాంకులుగా చూసి వారినుంచి ఓట్లు రాబట్టుకోవాలని చూశాయి, చూస్తున్నాయి. కానీ నిజమైన అర్థంలో వారికి అభివృద్ధి చేరడం లేదు. రాజకీయ స్వలాభం కోసం కొన్ని పార్టీలు ముస్లిం, హిందువుల మధ్య ఘర్షణలు రేపి, మారణహోమం సృష్టించటం ప్రజలు తెలుసుకున్నారు. మెజారిటీవాదం, ఆధిపత్యవాదం వల్ల హిందూ-ముస్లిం ఘర్షణలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి మత ఘర్షణల వెనుక వ్యాపారం, లాభాలు, మార్కెట్‌ను శాసించటం వంటి కారణాలు కూడా ఉంటున్నాయి.
ముస్లింలు తమ వేదనను తాము వ్యక్తీకరించుకోవటమే ముస్లిం అస్తిత్వవాదం. ముస్లింలు తమ అస్తిత్వం, అస్మితల మీద అకారణంగా దాడి జరుగుతున్నట్లుగా అభద్రతాభావానికి గురవుతున్నారు. మొదట కొందరు ముస్లింలు తమ మూలాలు ఇక్కడ లేవనే భ్రాంతిలో ఉన్నారు. కానీ ఇక్కడే ఈ భూమ్మీదనే తమ మూలాలు ఉన్నాయని, ఇదే తమ ‘వతన్ జమీన్’ అని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముస్లింవాదం ముస్లింల చైతన్యాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక వాదంగా నిలిచింది. ఈ వాదంలో మొదట ‘జల్జలా’, ‘అజా’ వంటి కవితా సంకలనాలు వచ్చాయి. గుజరాత్లో జరిగిన అల్లర్లను దానివెనుక ఉన్న ఆధిపత్య ధోరణులు, వ్యాపార కారణాలను ముస్లింలు గుర్తించాక ‘గుజరాత్ గాయం’ వంటి కవితా సంకలనాలు వచ్చాయి.ముస్లింవాద రచయితలు తాము ఎదుర్కొంటున్న వివక్ష, అణచివేతలతో పాటు, మతాచరణలతో ఎంతగా హింస, అణచివేతలకు గురవుతున్నారో ప్రభావవంతంగా అక్షరీకరించారు. కవిత, కథల్లో తమదైన వ్యక్తీకరణతో సాహితీ సృజన చేశారు.
‘ప్రపంచం మాయి పొరలో ఇరుక్కొని/ ఉమ్మనీరు తాగి
ఇవాళ కాషాయం కక్కుతోంది/
మా కాళ్ల సందుల్లో చొచ్చి మమ్మల్ని
బరిబత్తెల పరిగెత్తించారే అయినా/స్త్రీ తప్ప మగాణ్ని క్షమించేదెవరు? ఎప్పటికీ ప్రపంచం/ నా రొమ్ముతాగుతున్న పసిబడ్డే..’
అని షాజహానా తన ‘కాలీ దునియా’ అనే కవితలో రాసింది. 2021లో ముస్లిం స్త్రీవాదులు, స్త్రీవాద రచయిత్రుల కథా సంకలనం ‘మెహర్’ అనే పేరుతో ప్రచురింపబడింది. తెలంగాణలో ఉన్నంత మైనారిటీ ముస్లిం స్త్రీవాద రచయిత్రులు మరే ప్రాంతంలోనూ లేకపోవటం గమనార్హం.
స్కైబాబా సంపాదకత్వంలో వచ్చిన ‘వతన్’ కథా సంకలనం ముస్లింల వేదనను, వాదనను చక్కగా వ్యక్తీకరించింది. ఆ కథల్లో ముస్లింల మీద జరిగే అన్యాయాలను వివక్షను ప్రశ్నించారు. స్త్రీల అణచివేతలను గృహ హింసలను ‘పరదా’, ‘తలాక్’ వంటి దురాచారాలను నిరసించారు.
-ముదిగంటి సుజాతారెడ్డి , 99634 31606
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
KTR | ఎగ్గొట్టినదానితో కలిపి ఎకరానికి రూ.60వేల రైతుబంధు వెంటనే చెల్లించాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

