గ్రామీణ రుణ భారం
తగ్గించడమే లక్ష్యం…
రైతన్నలకు
ఆర్ధిక భరోసా
ఇవ్వాలన్న సంకల్పం….
కర్షకుల మోముల్లో
వెలుగులు నింపేందుకు…
తెలంగాణ ప్రభుత్వం
ప్రవేశ పెట్టిన
‘రైతు బంధు ‘ పథకం
దేశానికే ఆదర్శం!
యాసంగి,వర్షాకాలం
పంటలకు
రెండు సార్లు
ఆర్ధిక ఆసరా ఇచ్చేందుకు…
పెట్టుబడి రూపం లో…
ఎకరానికి
ఐదు వేల రూపాయలు
క్రమం తప్పకుండా
అందించే…
ప్రత్యక్ష రైతు పెట్టుబడి
మద్దతు పథకం ఇది!
విత్తనాలు
ఎరువులు
పురుగుల మందులు
కొనడానికి…
కర్షకులకు మద్దతు తెలిపే
గొప్ప పథకమిది!
రైతు బంధు
కే.సీ. ఆర్. మానస పుత్రిక…
మన రాష్ట్ర గౌరవాన్ని
చాటి చెప్పే కీర్తి పతాక!!
– దాస్యం సేనాధిపతి
ఎం.ఐ.జి. – II -90
హౌసింగ్ బోర్డ్ కాలనీ
కరీంనగర్ -505001
సెల్..
9440525544