చీకటి బతుకులోకి వెలుగు.. కంటివెలుగు..!!
కండ్ల మస్కల తోటి చేట్ల బియ్యం ఏరుకునే కష్టమైన దేవక్కలు../ మబ్బు వట్టిన కండ్ల తోటి టకటక సూదిమొన ఆడక ఆగిన యాదమ్మల బతుకు చక్రాలు../ కండ్లల్ల నీటికాసులతోటి దేశం బోయిన బిడ్డ కొరకై / దర్వాజల ఎదురుతెన్నుల లోలకాలై వేలాడే ఎల్లవ్వ తల్లులు../ కంట్లపువ్వాపరేషన్ కు పైసల్లేక తల్లడం మల్లడమయ్యే తలపాగా మల్లయ్యలు ../
కండ్ల మస్కల తోటి చేట్ల బియ్యం ఏరుకునే కష్టమైన దేవక్కలు../
మబ్బు వట్టిన కండ్ల తోటి టకటక సూదిమొన ఆడక ఆగిన యాదమ్మల బతుకు చక్రాలు../
కండ్లల్ల నీటికాసులతోటి దేశం బోయిన బిడ్డ కొరకై /
దర్వాజల ఎదురుతెన్నుల లోలకాలై వేలాడే ఎల్లవ్వ తల్లులు../
కంట్లపువ్వాపరేషన్ కు పైసల్లేక తల్లడం మల్లడమయ్యే తలపాగా మల్లయ్యలు ../
రేచీకట్ల తోటి గుడ్డి బతుకును ఎల్లదీసుకునే కొమురయ్యలు ../
కిడ్నీలవడ్డ రాళ్ళ తోటి కండ్లల్ల పాకిన ఎర్రజీర నొప్పులు../
కేర్ మన్న లేత కంటిపాపల మసక చూపులు..
ముట్లుడిగిన పెద్దవ్వల పొడి బారిన గాజుకండ్ల దురదలు../
సెప్పుకుంటే ఇసిత్రం గానీ గిన్ని కండ్ల కష్టాలు.. /
ఒక్క కంటివెలుగు పథకంతో తీరిపాయే..!!/
తొలివిడత మలివిడతలు గిన్నిస్ ల కెక్కె../
సమ్యక్ సమానత్వ భావనతో ప్రభుత్వం ప్రజల ముంగిలికే పంపిన డాక్టర్ల రథం../
ఏ విటమిన్.. డి విటమిన్ గోలీలు..సుక్కల డ్రాప్స్.. ఆయింట్మెంట్లతో/
సవరించబడిన దూరదృష్టి.. దగ్గరి దృష్టితో ..చూపు మందగించిన బడుగుజీవుల పాలిట వరదాయిని../
కంటి వెలుగుతో ఇంటింటా విరజిమ్మే ఉజ్వల నేత్రకాంతి../
మా కంటిపాపలో నిల్చిపోవా మా బాపు నీకేచ్చి ఋణం తీర్చుకోనూ అంటూ/
తెలంగాణ మొత్తం వేనోళ్ళ కీర్తిస్తున్న కంటివెలుగు పథకం
నివారించదగ్గ అంధత్వాన్ని తుడిచి పెట్టేస్తూ../
దేశమంతా అభినందించగా..
చీకటి బతుకుల ఎల్గును నింపుతూ../
ఆగమై కండ్లల్ల వెట్టుకున్న పానం మల్లా తిరిగొచ్చేనంటూ మురిసి ../
కన్నీటిబాష్పాలు కావివి..ఆనందబాష్పాలు అంటున్న పల్లె
వాకిట కంటివెలుగు..!!
విశ్వమంత వెలుగై విరాజిల్లు..!!

B. Kalagopal
– బి.కళాగోపాల్
ఇ.నెంబర్..3-3-387/సి,
గాయత్రీ నగర్
సిద్ధివినాయక గుడి దగ్గర,
నిజామాబాద్..503001
సెల్..9441631029
మెయిల్.. kalagopal.chintapatla@mail.com
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

