శాయరి సదువుతుంటే
శానా గొప్పగ ఉంటదనుకున్నా..
బల్లలు బాదుతుంటే
భలే బడ్జెట్ తెచ్చిందనుకున్నా..
తెలంగాణ కోసం ఏముందోనని
తెగ ఎదిరిజూసినా..
కొత్త రాష్ర్టానికి పాత హామీలన్నా
కొంతయినా వడ్డిస్తదనుకున్నా..
సప్తపథం అమృతకాలం
ఇంగ్లిష్ భాషా పాండిత్యం
గొప్ప గొప్ప పదాల ప్రయోగం
బడ్జెట్ అంతా ఉత్తర ప్రగల్భాలే
బయ్యారం ఉక్కు బోరు మనే
కోచ్ కోసం కాజీపేట కళ్లు కాచే
జాతీయహోదా నీళ్ళ కలవరింతే
నవోదయాలు నానబెట్టి ఎన్నాళ్లు
కొత్త కాదు తెలంగాణకు
మొదటి నుంచి చిన్న సూపే
దేశానికి సంపద సమకూర్చడంలో కీలకం
పథకాలు పంపకాల్లో చిట్ట చివరే..
-దాసరి మోహన్
99853 09080