దరిద్రాయ కృతం దానం
శూన్య లింగస్య పూజనం
అనాథ ప్రేత సంస్కారం
అశ్వమేథ ఫలం లభేత్!
దానం మంచి పని. అందులోను దరిద్రులకు దానం చేయటం మరీ మంచిది. లింగపూజ మంచిది. ఆదరణ కరువై ఎక్కడో పడియున్న లింగానికి పూజ చేయటం ఇంకా ఎక్కువ సత్ఫలితాన్నిస్తుంది. అట్లే, అనాథ ప్రేతకు, దిక్కుమొక్కులేక పడియున్న శవానికి అంతిమ సంస్కారం జరిపించడం వలన అశ్వమేథయాగం చేసిన వారికి లభించే పుణ్యం దక్కుతుంది.
టి.సుధాకరశర్మ