ఏమౌతుంది?
అవును... యుద్ధమొస్తే ఏమౌతుంది? వెన్నెల్లో
అవును…
యుద్ధమొస్తే ఏమౌతుంది?
వెన్నెల్లో
గోరుముద్దలు తినాల్సిన బాల్యం
దుఃఖనదిలో కొట్టుకుపోతుంది!
సరదాగా చిందేయాల్సిన యవ్వనం
కన్నవాళ్ళ అవయవాలు గుర్తుపట్టడంలో
తలమునకలవుతుంది!
మనవళ్లకు కథలు చెప్పాల్సిన వృద్ధాప్యం
పగిలిన గుండెను అతికించుకోవడంలో
కాలం వెళ్ళదీస్తుంది!
లేలేత కిరణాలతో
భూపాలాన్ని ఆలపించాల్సిన సూర్యుడు
ప్రవహిస్తున్న రక్తపుటేరులను
ఎండగట్టే పనిలో పడతాడు!
పిల్లలతో ఆడుకోవాల్సిన పండువెన్నెల
సమాధులను ఆర్ద్రంగా తడుముతూ
ఒంటరితనాన్ని పోగొట్టుకుంటుంది!
అందరినీ సమంగా పలకరించే చల్లగాలి
విషాదాన్ని భగ్నం చేయడానికి
మృత్యుగీతం పాడుతుంది!
ఊగుతున్న చెట్టుకొమ్మలూ
పరుగెత్తే నదీనదాలూ
కరిగిపోతున్న మంచు పర్వతాలు
అప్రమత్తం చేసే చీకట్లూ
తన అస్తిత్వాన్ని తానే సమాధి చేసుకునే
మనిషి తీరును చూసి పగలబడి నవ్వుతాయి..!
ఎన్.నరేశ్‌చారి
97013 34516
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

