విశ్రాంతి లేని నిజాలు
ఒక్కో రోజుకు బాకీ పడతామో, బాకీ తీరుతుందో తెలియదు.
ఒక్కో రోజుకు బాకీ పడతామో,
బాకీ తీరుతుందో తెలియదు.
పగలంతా ఊహల్లో ఈత
రాత్రంతా మెలకువలో మునక
ఊడిగం చేసే ఆలోచనలో
విశ్రాంతి లేని నిజాలు
వెలుతురును కప్పుకుని
ఎండలో ఎగురుతూ
చీకటిని చుట్టుకుని
చలిలోముడుచుకొని
తలను నేలలో పాతి
ఆకాశానికి కాళ్లను వేలాడతీసి
సంద్రంలా మారిన మెదడులో
తెరలు తెరలుగా కలలు
నిద్రను ఢీ కొని బద్దలైన రోజులో
బద్ధకంగా బతికే ఉంటాయి.
– శ్రీ సాహితి 97044 37247
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

