బట్టకట్టే భాగ్యం
వాడేమో... నగరాన్ని శుద్ధిచేసే వానదేవుడిలా దారప్పోగులు కడిగే తలస్నానం
వాడేమో…
నగరాన్ని శుద్ధిచేసే వానదేవుడిలా
దారప్పోగులు కడిగే తలస్నానం
అమ్మేమో…
భుజం మీద ఎన్ని నొప్పి సూదులు పొడుస్తున్నా
ఆకలి కడుపు నిండిన పిల్ల సంబురం
కళ్ళముందు కదలాడు ఆసు యంత్రం
వాడేమో…
ఆకాశం మీది నక్షత్రాలు
నూలు పోగుల మీద పూయించి
రంగులద్దు నేలమీది ఇంద్రధనుస్సు
అమ్మ…
కలలకు ఊపిరి ముడేసి
అచ్చు దారానికి
పడుగు పోగుల ప్రాణం అతికే ఫెవికోలు
మహాత్ముడు తిప్పుతున్నట్టు
తిరిగే రాట్నం
కండె వెనుక కండే వరుసగట్టు
మెతుకు పూలహారం
రాత్రీ పగలూ కంట్లో వొత్తులేసుకుని
నాలుగు చేతుల అల్లిన చీర
ప్రపంచం మెచ్చిన శ్రమ గీతం
తూనీగ రెక్కలిరిసిన
నెయ్యీ బువ్వ
నాడె పట్టినప్పటి నుండి పేనుతున్న
బట్టకట్టే భాగ్యం..!
గజ్జెల రామకృష్ణ
89774 12795
నేడు జాతీయ
చేనేత దినోత్సవం…
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

