సుశీలో మాతృపుణ్యేన
పితృపుణ్యేన బుద్ధిమాన్
ధార్మికో పూర్వపుణ్యేన
స్వీయ పుణ్యేన భాగ్యవాన్
ఏ వ్యక్తి అయినా తనకు జన్మనిచ్చిన తల్లి చేసిన పుణ్యం వలన మంచి శీల సంపద గలవాడవుతాడు. తండ్రి చేసిన పుణ్యం వలన బుద్ధిమంతుడవుతాడు. తాను చేసిన పూర్వపుణ్యం వల్ల ధర్మాత్ముడవుతాడు. తాను స్వయంగా చేసిన పుణ్యం వల్ల ధనవంతుడవుతాడు.
టి.సుధాకరశర్మ