శా॥ భానుండొక్కడె చూచువారలకు
దా బల్ మూర్తులన్నట్లుగా
గానన్ వచ్చెడు రీతి,
జీవగతులున్ గన్పించనెన్నున్న నా
లోనన్ వెల్గెడుబ్రాణమొక్కటది
యున్ లోకేశ నీరూపమే
సానందా! శుభదాయకా!
భవహరా! చంద్రార్థమౌళీశ్వరా!
శా॥ ధ్యానంబెప్పుడు దివ్యనామజపమున్
హాయిన్ దగన్ దూగుచున్
‘నే నిన్ గానగలేన’టన్న!
మదిలో నిర్వ్యాజమౌ ప్రేమతో
నీనాడిట్టులజిన్ని బాలకుడవై
యేతెంచినావో శివా!
సానంద! శుభదాయకా!
భవహరా! చంద్రార్థమౌళీశ్వరా!
శా॥ ప్రాణంబీవయి దేహమందు
నిలవన్ ప్రారబ్ధకర్మంబులన్
యానంబిట్టులజేయుచుంటి
బలుసన్మానావమానంబులన్
నేనే కారణమంచునీల్గి;
దయతో నీధ్యాసగల్గింపవే!
సానందా! శుభదాయకా!
భవహరా! చంద్రార్థ మౌళీశ్వరా!
– గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ9490003295