అగ్నిపుష్పం
కలల సమాధుల మీద గూడు కట్టుకున్న పక్షిని.. రెక్కలు కత్తిరించిన రాజ్యము కాళ్ళు కట్టేసిన కార్పొరేట్ సంస్కృతి
కలల సమాధుల మీద గూడు కట్టుకున్న పక్షిని..
రెక్కలు కత్తిరించిన రాజ్యము
కాళ్ళు కట్టేసిన కార్పొరేట్ సంస్కృతి
తండ్లాడే ఆత్మకు వాసమెక్కడా!?
నీళ్లతో ఆరే దాహం కాదిది
రొట్టె ముక్కలతో తీరే ఆకలి కాదిది
ఒంటరి దాన్నే- నేనొంటరి దాన్నే
అస్తిత్వపు బాట మీద నడక నాది
గళం విప్పిన కోకిల పాడిన పాటకు సంకెళ్లు లేవు
తండ్లాడే ఆత్మకు కుదురెక్కడా!?
ముళ్ళకంచె మీద వాలిన కట్లపూల చెట్టును నేనే
గోడ వారగా ఎదిగిన తంగేడు కంచెను నేనే
నేల, నింగికి మధ్య నిండిన శూన్యాన్ని నేనే
వీర వనితల పోరాట పరిమళాలనూ నేనే
పల్లె పొలాల్లో ప్రవహించే పడుచు కన్నియల కలిసి
అడవి బిడ్డల తోడ, ఆడబిడ్డల గుంపై
నిలువెత్తు నిలిచిన బతుకమ్మను నేనే
గుట్ట వాలున పారే గడ్డి పూల
చెలిమలు-కాలి మువ్వలు
గుమ్మడి పూల కొప్పు,
నడుమున గునుగు పూల కత్తి
బంగారు తంగేడు చురకత్తుల గుత్తి,
జిల్లేడు పూల శంఖు చేత బట్టి
అల్లంత దూరాన గడ్డి చామంతుల ఎదుర్కోలు
భుజాలపై బతుకు పోరాటాల మోస్తూ,
నిప్పుల గుండంలో ఎగిసే అగ్నిపుష్పాన్ని
నిప్పు రవ్వల పాటనై ఎగిరే బహుజన పతాకాన్ని..
-డా. రూప్ కుమార్ డబ్బీకార్ ,9177857389
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

