టైమ్‌పాస్‌కి మాత్రమే కాకుండా అన్ని అవసరాలకు తగిన కంటెంట్‌ని యూట్యూబ్‌లో నిత్యం చూస్తుంటాం. కానీ, కొన్నిసార్లు చూడటానికి టైమ్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఆయా వీడియోలను లింక్‌లను కాపీ చేసి విండోస్ ఉన్న స్టిక్కీ నోట్స్‌లోనో.. మరెక్కడైనా సేవ్ చేసి పెట్టుకుంటున్నారా? అంత కష్టపడక్కర్లేదు. యూట్యూబ్ ప్రత్యేకంగా ‘వాచ్ లేటర్’ అనే ఫీచర్‌ను అందిస్తున్నది.
చాలామంది పెద్దగా గమనించరు. దీంతో చాలా సులభంగా వీడియోలను బుక్ మార్క్ చేసి పెట్టుకోవచ్చు. డెస్క్‌టాప్ లేదా మొబైల్ యాప్‌లో ఈ ఫీచర్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. సేవ్ చేయాలనుకున్న వీడియోను ఓపెన్ చేసిన తర్వాత కనిపించే మూడు చుక్కల ఐకాన్ (మెనూ)పై క్లిక్ చేసి ‘సేవ్ టు ప్లేలిస్ట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ‘వాచ్ లేటర్ చెక్ బాక్స్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఆ వీడియోను సేవ్ చేసుకోవచ్చు.
ఇలాగే, మొబైల్ యాప్‌లో కూడా ‘సేవ్’ బటన్ ట్యాప్ చేసి ‘వాచ్ లేటర్’ ఎంపిక చేయడం ద్వారా వీడియోలు జాబితాలో చేరతాయి. ఇలా సేవ్ చేసిన వీడియోలను ‘వాచ్ లేటర్’ ప్లేలిస్ట్‌లో చూసేందుకు డెస్క్‌టాప్‌లో ఎడమవైపు ఉన్న హోంబర్గర్ మెనూలో ‘వాచ్ లేటర్’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మొబైల్ యాప్‌లో, హోంపేజీలో కింద ఉన్న లైబ్రరీ ట్యాబ్ ద్వారా ‘వాచ్ లేటర్’ ప్లేలిస్ట్‌కు చేరుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులకు వీడియోల లింక్‌ను కాపీ చేసి భద్రపర్చుకోవాల్సిన అవసరం ఉండదు.