పెళ్లి తర్వాతి కొత్త జీవితం.. యువతుల కొలువుకు ముగింపు పలికేలా చేస్తున్నది. భారత్‌సహా దక్షిణాసియా దేశాల్లో ఉద్యోగం చేస్తున్న వివాహితుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.
భారత్‌లో వివాహం అనంతరం ఉద్యోగాలు మానేస్తున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. పెండ్లి తర్వాత మహిళల ఉపాధి రేటు 12 శాతం మేర పడిపోయింది. అంతేకాకుండా.. దక్షిణాసియాలో అర్హత ఉన్న మహిళల్లో కేవలం 32శాతం మంది మాత్రమే పనిచేస్తున్నారని నివేదిక వెల్లడించింది.
అమ్మాయిల చదువులు మధ్యలోనే ఆగిపోవడం, చిన్న వయసులోనే పెండ్లి చేయడం లాంటి చర్యలు.. మహిళా ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. పురుషులతో సమానంగా మహిళలకూ ఉద్యోగ అవకాలు కల్పించడం, శ్రామిక శక్తిలో వారి భాగస్వామ్యాన్ని పెంచినట్లయితే.. దక్షిణాసియా ప్రాంతీయ జీడీపీ 13 శాతం నుంచి 51 శాతానికి పెరిగే అవకాశం ఉన్నదని సర్వే చెబుతున్నది.