ప్రకృతికి దగ్గరగా ఉండే వన్నెలు కళ్లకు హాయినీ, మనసుకు ప్రశాంతతనూ కలిగిస్తాయి. అలాంటి మట్టి రంగుల్ని ఇష్టంగా ధరించేవారు చాలా మందే ఉంటారు. ఆ అభిరుచి ఉన్నవాళ్ల కోసం నూలు వస్త్రంతో పెసర పచ్చ వన్నెలో రూపొందించిందే ఇక్కడ కనిపిస్తున్న స్కర్టు.
లేత బ్రౌన్, మసక నారింజ రంగుల ప్రింట్లు దీనికి సొగసులద్దాయి. పువ్వులు, మామిడి పిందెలు, జామెట్రిక్ ఆకృతులు ఇందులో ఉన్నాయి. నడుము దగ్గర వెడల్పాటి పట్టీతో వచ్చిన దీనికి మ్యాచింగ్ టాప్‌తో జతచేస్తే.. నచ్చినప్పుడు ధరించేలా స్వచ్ఛమైన వన్నెల డ్రెస్ రెడీ!
– సమతా చౌదరి, డిజైనర్ wowobySamathachowdari