ప్రసూతి వణుకు
‘పండంటి ఆడబిడ్డ’ నర్సమ్మ ప్రకటిస్తుంది. భర్త మురిసి పోతాడు. అత్తామామలు సంతోషిస్తారు. పుట్టింటివాళ్లు పండుగ చేసుకుంటారు. కన్నతల్లి ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అంతలోనే.. అనూహ్యమైన మార్పు.
‘పండంటి ఆడబిడ్డ’ నర్సమ్మ ప్రకటిస్తుంది. భర్త మురిసి పోతాడు. అత్తామామలు సంతోషిస్తారు. పుట్టింటివాళ్లు పండుగ చేసుకుంటారు. కన్నతల్లి ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. అంతలోనే.. అనూహ్యమైన మార్పు. ఆ పచ్చి బాలింతరాలి శరీరం చిగురుటాకులా వణికిపోవడం మొదలవుతుంది. సాధారణ ప్రసవమైనా, సిజేరియన్ అయినా.. పెద్దగా తేడా ఉండదు. రెండు సందర్భాల్లోనూ ఈ సమస్య ఎదురుకావచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనికి అనేక కారణాలు.
అందులో ముఖ్యమైంది రక్తహీనత. డెలివరీ సమయంలో తల్లి చాలా రక్తాన్ని కోల్పోతుంది. రక్తాన్ని వేగంగా వృద్ధి చేసుకోవడం ద్వారా శరీరమే సగానికి సగం లోటును భర్తీ చేసుకొనే ప్రయత్నం చేస్తుంది. అయినా, రక్తహీనత వెంటాడుతూనే ఉంటుంది. దీనివల్లే వణుకు రావచ్చు. శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు కూడా ఓ కారణమేనంటున్నారు స్త్రీవైద్య నిపుణులు. డెలివరీ సమయంలో తల్లి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. హార్మోన్ల వ్యవస్థ కూడా ఆ ప్రభావానికి లోనవుతుంది.
‘షివరింగ్ రియాక్షన్స్’కు దారితీసే పరిస్థితులే ఇవన్నీ. థైరాయిడ్ సమస్యలు, ఐరన్ లోపాన్ని కూడా తేలిగ్గా తీసుకోలేం. దాదాపు 32శాతం బాలింతలు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటారని గణాంకాలు చెబుతున్నాయి. డెలివరీ తర్వాత కొద్ది గంటలపాటూ ఉక్కిరిబిక్కిరి చేస్తుందీ సమస్య. ఇది హానికరం కూడా కాదు. రోజుల తరబడి కొనసాగితే మాత్రం వైద్యుల సలహా తీసుకోవాలి. వెచ్చని దుప్పటి సమకూర్చడం, వేడివేడి పానీయాలు ఇవ్వడం, రూమ్ హీటర్ సాయంతో గదిని వెచ్చగా మార్చడం.. మొదలైన చిట్కాలూ కొంతమేర పనిచేస్తాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

