Winter Journey | చలికాలంలో ప్రయాణాలు చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి
Winter Journey precautions | చలికాలంలో ఉన్న ఊళ్లో ఇంట్లో ఉంటేనే జలుబులు, జ్వరాలూ వచ్చేస్తాయి. ఇక ఈ సీజన్లో ప్రయాణమంటే మాటలా..! కొత్త చోటులో, కొత్త వాతావరణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు అవసరం.
Winter Journey precautions | చలికాలంలో ఉన్న ఊళ్లో ఇంట్లో ఉంటేనే జలుబులు, జ్వరాలూ వచ్చేస్తాయి. ఇక ఈ సీజన్లో ప్రయాణమంటే మాటలా..! కొత్త చోటులో, కొత్త వాతావరణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు అవసరం. శీతాకాలంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విమానాలు ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో తెలియదు. రైళ్లు కూడా ఆలస్యంగా వచ్చే అవకాశాలే ఎక్కువ. ఇలాంటప్పుడు సమయం వృథా కాకుండా, ట్రిప్ క్యాన్సిల్ కాకుండా నిపుణులు కొన్ని టిప్స్ ఇస్తున్నారు.
♦ వీలైనంతవరకు ఒకే విమానం లేదా ఒకే రైల్లో ప్రయాణం చేసేలా చూసుకోండి. అంటే మధ్యలో మజిలీలు వద్దు. మధ్యలో ఆగకుండా ఒకేసారి గమ్యం చేరేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా విమాన ప్రయాణాల్లో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మొదటి విమానం ఆలస్యంగా వస్తే, ఆ తరువాత ఎక్కాల్సిన విమానం వెళ్లిపోవచ్చు. అప్పుడు మరో విమానం కోసం వెయిట్ చేయాల్సిన సమయంలో ఎక్కడ ఉండాలో అర్థం కాదు. అంతేకాకుండా మరో విమానంలో సీట్లు ఉండకపోవచ్చు. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే నాన్ స్టాప్ ఆప్షన్‌ను ఎంచుకుని మజిలీ లేకుండా ప్రయాణం చేయడం మేలు.
♦ వీలైనంతవరకు పొద్దున్నే బయలుదేరడం మేలు. చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. విమానం లేదా రైలు ఆలస్యం అయినప్పటికీ ఏ అర్ధరాత్రి పూటో చిక్కుకుపోకుండా ఉంటారు.
♦ మీరు బయలుదేరేముందే అక్కడి వాతావరణం ఎలా ఉందో ముందుగానే కనుక్కోండి. పొగమంచు ఎలా ఉండబోతుందనేది ముందుగానే వాతావరణ వివరాల్లో తెలుసుకోండి.
♦ ఎయిర్‌లైన్ వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తూ ఉండండి. చాలా రకాల ఎయిర్‌లైన్స్ వాటి అప్డేట్స్ను సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటాయి. వీటిని ఫాలో కావడం వల్ల ముందుగానే వివరాలు తెలుసుకోవచ్చు.
♦ ప్యాకింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అన్నీ పెట్టుకోండి. సబ్బు, టూత్‌బ్రష్, దువ్వెన, టవల్ లాంటివి పైకి, సులువుగా దొరికేలా సర్దుకోండి. ఒకవేళ వెయిట్ చేయాల్సి వచ్చినా ఇవి తొందరగా దొరుకుతాయి.
♦ చలికాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల అవకాశమూ ఉంటుంది. కాబట్టి బేసిక్ మందులు అంటే జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి లాంటి వాటికి సంబంధించిన మందులు తప్పనిసరిగా తీసుకెళ్లండి. డయాబెటిస్ లాంటి జబ్బులుంటే మీ మందుల కిట్ తీసుకెళ్లడం అస్సలు మరవొద్దు.
♦ స్వెట్టర్లతో పాటుగా బ్లాంకెట్ కూడా అదనంగా తీసుకెళ్లండి.
Read More :
“Kottankulangara Devi Temple | ఈ ఆలయంలో పురుషులకు నో ఎంట్రీ.. చీర కట్టుకుంటే మాత్రం రానిస్తారు”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

