Kottankulangara Devi Temple | ఈ ఆలయంలో పురుషులకు నో ఎంట్రీ.. చీర కట్టుకుంటే మాత్రం రానిస్తారు
Kottankulangara Devi Temple | కొల్లం జిల్లాలో కొట్టాన్ కొల్లారా ఆలయం ఉన్నది. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని నమ్ముతారు జనాలు. అయితే ఈ ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం ఉన్నది. పురుషులకు అనుమతి లేదు.
Kottankulangara Devi Temple | గుడిలోకి వెళ్లాలంటే సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఇప్పుడు దాదాపు అన్ని దేవాలయాల దగ్గర ఈ నియమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అయితే కేరళలోని ఒక ఆలయంలో మాత్రం ఒక భిన్నమైన ఆచారం ఉన్నది.
కొల్లం జిల్లాలో కొట్టాన్ కొల్లారా ఆలయం ఉన్నది. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని నమ్ముతారు జనాలు. అయితే ఈ ఆలయంలో ఒక విచిత్రమైన ఆచారం ఉన్నది. పురుషులకు అనుమతి లేదు. అయితే వెళ్లాలకుంటే వారు ఆడవారిలా చీరకట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని, పెదవులకు లిప్స్టిక్, తలలో పూలు పెట్టుకుంటే ఆలయంలోకి అనుమతిస్తారట. అలా అలంకరించుకునేందుకు ఆలయంలో తగిన ఏర్పాట్లు కూడా ఉంటాయట. ఆరోగ్యం, వివాహం, విద్య, ఉద్యోగం.. ఇలా ఏ అంశంలోనైనా సమస్య వచ్చినప్పుడు అమ్మవారిని వేడుకుంటారు భక్తులు. అనుకున్నవి జరుగగానే వచ్చి మొక్కులు చెల్లించుకొంటారు. అయితే ఈ ఆచారం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి కొందరు పశువుల కాపరులు చీరలు ధరించి దగ్గరలో ఉన్న ఒక రాయికి పూజలు చేశారట. అందులో దైవశక్తిని గమనించి కొట్టన్గా పిలిచి గుడి కట్టారట. అప్పట్నుంచి పురుషులు స్త్రీ వేషధారణలో ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఓసారి కొబ్బరికాయను ఈ రాయికేసి కొడితే రక్తం వచ్చినట్టు చెబుతారు. అప్పట్నుంచి ఈ రాయిని మరింత విశిష్టమైనదిగా భావిస్తున్నారు. అంతేకాదు, ఈ రాయి పరిమాణం పెరుగుతూ వస్తున్నదని చెబుతున్నారు.
Read More :
“హైదరాబాద్ సమీపంలో ఉన్న మరకత శివలింగ ఆలయం ప్రాముఖ్యత తెలుసా”
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

