వాట్సాప్ కేవలం ఓ చాటింగ్ యాప్ మాత్రమే కాదు. మనందరి డైలీ లైఫ్‌లో భాగమైపోయింది. ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటి కబుర్లు మొదలుకొని ఫ్యామిలీ గ్రూప్‌లో ఫొటోలు షేర్ చేయడం, ఆఫీస్ వర్క్ డిస్కస్ చేయడం.. అన్నీ వాట్సాప్‌లోనే సాగిపోతున్నాయి. టైప్ చేయడానికి ఓపిక లేకపోతే.. వాయిస్ కమాండ్స్‌తో టెక్ట్స్ పంపుతున్నాం. ఇంకా ఈజీగా వాయిస్ మెసేజ్‌లు కూడా పంపేస్తున్నాం. కానీ, అలా వాయిస్ మెసేజ్‌లు అందుకున్నవాళ్లు, వాటిని వెంటనే వినే అవకాశం ఉండకపోవచ్చు. ఏ మీటింగో జరుగుతున్నా, చుట్టూ నలుగురు ఉన్నా.. వాయిస్ మెసేజ్ వినడం ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో సదరు వాయిస్ మెసేజ్ కూల్‌గా చదివేస్తే భలేగా ఉంటుంది కదా! అదెలా సాధ్యం అంటారా? వాట్సాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్‌తో ఇది సాధ్యమే! ఈ ఆప్షన్‌తో వాట్సాప్‌లో వచ్చిన వాయిస్ మెసేజ్‌ను వినకుండా.. చదివేయొచ్చు. గతేడాది నవంబర్‌లో ప్రకటించిన ఈ ఫీచర్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్ వాడేసుకోవచ్చు.
త్వరలో ఐఓఎస్ యూజర్స్‌కి కూడా అందుబాటులోకి రానుంది. ఈ కన్వర్షన్ ప్రాసెస్ అంతా ఫోన్లోనే ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ‘ఆన్-డివైజ్ ప్రాసెస్’ అంటారు. మీ ఫోన్లోనే వాయిస్ టు టెక్ట్స్‌గా మారిపోతుందన్నమాట. వాట్సాప్ కూడా దీనిని యాక్సెస్ చేయదు కాబట్టి మీ ప్రైవసీకి వచ్చే ముప్పేమీ ఉండదు. ఇప్పటికైతే ఇంగ్లిష్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్ భాషలకు ఈ ట్రాన్స్క్రిప్షన్ పనిచేస్తుంది. త్వరలోనే ఇతర భాషలకూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆప్షన్ని సెట్ చేసుకునేందుకు వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ ‘Chats’ లోకి వెళ్లి అందులోని ‘Voice Message Transcripts’ ఫీచర్‌ని Enable చేసి.. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వాయిస్ మెసేజ్ లాంగ్ ప్రెస్ చేసి ‘More Options’లోకి వెళ్లి ‘Transcribe‘ ప్రెస్ చేస్తే, ఆడియోతోపాటు టెక్స్ కూడా కనిపిస్తుంది. సో.. వాయిస్ మెసేజ్
వినలేని పరిస్థితుల్లో ఎంచక్కా చదివేసి.. రిైప్లె ఇస్తే ఆల్ హ్యాపీస్!