టీనేజర్ల జాతకం పేరెంట్స్ చేతిలో!
సోషల్ మీడియా, మేనేజింగ్ యాప్‌లలో తమ పిల్లల డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న వేళ, మెటా యాజమాన్యంలోని వాట్సప్ కీలక నిర్ణయం తీసుకున్నది. టీనేజర్ల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘పేరెంటల్ కంట్రోల్స్' సదుపాయాన్ని పరిచయం చేసింది. పిల్లల అవసరాలకు అనుగుణంగా తల్లిదండ్రులు, టీనేజర్లు కలిసి ఈ సెట్టింగ్స్‌ను ఎంచుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.
సోషల్ మీడియా, మేనేజింగ్ యాప్‌లలో తమ పిల్లల డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న వేళ, మెటా యాజమాన్యంలోని వాట్సప్ కీలక నిర్ణయం తీసుకున్నది. టీనేజర్ల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘పేరెంటల్ కంట్రోల్స్’ సదుపాయాన్ని పరిచయం చేసింది. పిల్లల అవసరాలకు అనుగుణంగా తల్లిదండ్రులు, టీనేజర్లు కలిసి ఈ సెట్టింగ్స్‌ను ఎంచుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. మెటా వేదికల వల్ల పిల్లలపై పడుతున్న ప్రభావం, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిళ్లు, న్యాయపరమైన సవాళ్ల నేపథ్యంలో వాట్సప్ ఈ మార్పులు చేపట్టడం గమనార్హం. వాట్సప్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్లు తల్లిదండ్రులకు పలు నియంత్రణ అధికారాలను ఇస్తుండటం విశేషం.
ప్రైవసీ సెట్టింగ్స్: టీనేజర్ల ప్రొఫైల్ ఫొటోను ఎవరు చూడాలి, వారిని ఏ గ్రూప్‌లలో చేర్చాలనేది ఇకనుంచి తల్లిదండ్రులే నిర్ణయించవచ్చు. ఒకవేళ టీనేజర్లు ఈ నిబంధనలను మార్చాలనుకుంటే కూడా తల్లిదండ్రులు సెట్ చేసిన పిన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
గ్రూప్ నోటిఫికేషన్లు: పిల్లలు ఏదైనా కొత్త గ్రూప్‌లో చేరినా, గ్రూప్ నుంచి బయటకు వచ్చినా లేదా ఆ గ్రూప్‌లో సభ్యుల సంఖ్య ఉన్నట్లుండి పెరిగినా తల్లిదండ్రులకు తక్షణ సమాచారం అందుతుంది.
స్టేటస్ కంట్రోల్: పిల్లలు ఎవరి స్టేటస్లు చూడాలి? వారి స్టేటస్ ఎవరికి చూయించాలి? ఛానెల్స్ ఎలా ఉపయోగించాలనే అంశాలను నియంత్రించేందుకు పేరెంట్స్ నిఘా తప్పనిసరిగా ఉండనుంది.
భద్రతకు ఢోకా లేదు: అయితే ఈ కంట్రోల్స్ పూర్తిగా ఐచ్ఛికం. కుటుంబ అవసరాలను బట్టి వీటిని ఎప్పుడైనా మార్చుకోవచ్చు లేదా నిలిపివేయవచ్చు. పేరెంటల్ కంట్రోల్స్ ఆన్‌లో ఉన్నప్పటికీ పిల్లల వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్ ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్’ పరిధిలోనే ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది. అంటే ఆ సంభాషణలను తల్లిదండ్రులు లేదా వాట్సప్ కూడా చూడటం సాధ్యపడదు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

