Whisky | మద్యం ప్రియులు రోజూ తాగే విస్కీ వెనుక ఇంత కథ ఉందా..?
ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాలకు అనేక దినోత్సవాలు, రోజులు ఉన్నట్లే మద్యం ప్రియులకు, అందులోనూ విస్కీ అంటే ఇష్టపడేవారికి కూడా ఒక రోజు ఉంది. అదే ఇంటర్నేషనల్ విస్కీ డే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్యం ప్రియులను ఆ రోజు ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.
Whisky | ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాలకు అనేక దినోత్సవాలు, రోజులు ఉన్నట్లే మద్యం ప్రియులకు, అందులోనూ విస్కీ అంటే ఇష్టపడేవారికి కూడా ఒక రోజు ఉంది. అదే ఇంటర్నేషనల్ విస్కీ డే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మద్యం ప్రియులను ఆ రోజు ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. ప్రతి సంవత్సరం మార్చి 27న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మద్యం గురించి అనేక పుస్తకాలను రచించిన మైకేల్ జాక్సన్ అనే ప్రముఖ రచయిత గౌరవార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2008లో ప్రకటించి, 2009లో నెదర్లాండ్స్‌లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా విస్కీలను అధ్యయనం చేసి, వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. విస్కీ అనేది ధాన్యాలైన బార్లీ, కార్న్, రై, గోధుమలతో తయారు చేసే ఒక పానీయం. దీన్ని అనేక రకాలుగా తయారు చేస్తారు. సంప్రదాయ విధానం అయితే చెక్క బ్యారెల్స్ ను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని ఓక్ వృక్షం కలప నుంచి తయారు చేస్తారు. ఆ బ్యారెల్స్‌లో నిల్వ ఉంచి విస్కీని తయారు చేస్తారు. అయితే దీని తయారీ విధానం, ప్రాంతం, అలాగే స్పెల్లింగ్ కూడా దాని రుచిని, స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి.
whisky, whiskey.. తేడా ఏమిటి..
స్కాట్లాండ్, జపాన్, కెనడా వంటి దేశాల్లో whisky అనే స్పెల్లింగ్ (e లేకుండా) ఉపయోగిస్తారు. అయితే ఐర్లాండ్, అమెరికా దేశాల్లో మాత్రం whiskey (e తో) అని రాస్తారు. కాబట్టి ఆ పదంలో ఉండే e అనే అక్షరం ఆ పానీయం ఎక్కడ తయారైందో సూచిస్తుంది. అలాగే తయారీ విధానంలో కూడా తేడాలు ఉన్నాయి. స్కాట్లాండ్లో తయారయ్యే స్కాచ్ విస్కీకి కఠిన నిబంధనలు ఉంటాయి. కనీసం మూడు సంవత్సరాలు అక్కడే నిల్వ చేయాలి. ఐరిష్ విస్కీ సాధారణంగా మూడు సార్లు డిస్టిల్ చేయబడుతుంది, అందువల్ల అది మరింత సాఫ్ట్‌గా ఉంటుంది. జపనీస్ విస్కీ స్కాటిష్ విధానాన్ని అనుసరించినప్పటికీ, ప్రత్యేకమైన సమతుల్యతను కలిగి ఉంటుంది. అమెరికన్ విస్కీ మాత్రం కార్న్ ఆధారంగా తయారై, తీపి రుచిని ఇస్తుంది. రుచుల పరంగా కూడా స్పష్టమైన భేదాలు కనిపిస్తాయి. స్కాచ్ విస్కీ సాధారణంగా స్మోకీ, గాఢమైన రుచిని ఇస్తుంది. ఐరిష్ విస్కీ మృదువుగా, తేలికగా ఉంటుంది. జపనీస్ విస్కీ సంతులితంగా, సున్నితమైన ఫ్లోరల్ నోట్స్‌తో ఉంటుంది. అమెరికన్ విస్కీ మాత్రం వనిల్లా, కరమెల్ వంటి తీపి రుచులతో ప్రసిద్ధి చెందింది.
భారత్‌లోనూ..
భారత్‌లో ఎక్కువగా whisky అనే స్పెల్లింగ్‌తో కూడిన పదాన్ని అనుసరిస్తారు. కానీ ఇటీవల కొన్ని భారతీయ బ్రాండ్లు తమ ప్రత్యేకతను చూపించేందుకు whiskey అనే రూపాన్ని కూడా ఉపయోగిస్తున్నాయి. దేశంలో విస్కీ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతూ, కొత్త ట్రెండ్స్‌ను సృష్టిస్తోంది. whisky, whiskey మధ్య తేడా కేవలం స్పెల్లింగ్లోనే కాదు, వాటి మూలం, తయారీ విధానం, రుచి అన్నీ కలిపి ఈ రెండు రూపాలకు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మద్యం తాగడాన్ని ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

