కూరగాయలు తినేదెలా?
నేను అన్నంలో కూరలు పలుచగా కలుపుకొంటాను. అన్నంతో సమానంగా కూరలు తినాలి అంటారు కదా. అలా అని కారం తక్కువైతే తినబుద్ధికాదు. మరి నేను కూరగాయలు తినడమెలా?
నేను అన్నంలో కూరలు పలుచగా కలుపుకొంటాను. అన్నంతో సమానంగా కూరలు తినాలి అంటారు కదా. అలా అని కారం తక్కువైతే తినబుద్ధికాదు. మరి నేను కూరగాయలు తినడమెలా?
– ఓ పాఠకురాలు
కూరగాయల్లో జీర్ణశక్తికి ఉపయోగపడే పీచులు అధికంగా ఉంటాయి. కాబట్టే వాటిని తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అలా కాని పక్షంలో తినాల్సిన దానికన్నా కాస్త ఎక్కువే తింటాం. అందుకే అన్నంతో సమానంగా కూరగాయలు తినమని చెబుతారు. ఇలా తినడం అనేది బరువు తగ్గేందుకు, కొలెస్ట్రాల్ కరిగించుకునేందుకు, బీపీ, డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాబట్టి చాలా జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి.
విటమిన్-ఎ, ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలిక్ యాసిడ్ కూరల్లో ఎక్కువగా దొరుకుతాయి. ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరల్లాంటివన్నీ కూరల కిందికే వస్తాయి. అందులోనూ ఆకుకూరల్ని వారానికి మూడు సార్లయినా తినాల్సిందే. మైక్రో గ్రీన్స్, బేబీ స్పినాచ్ లాంటివి సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. ఆకుకూరల్ని ఊరికే పోపు పెట్టి అయినా పచ్చకూరలా వండుకోవచ్చు. పప్పులోనూ వేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్… సలాడ్, జ్యూస్‌లాగా తీసుకోవచ్చు.
క్యాలీఫ్లవర్, బ్రకోలీ లాంటివి మైక్రోవేవ్ ఓవెన్లో బేక్ చేసి ఉప్పు, మిరియాల పొడి చల్లి కాస్త నూనె వేసి తినొచ్చు. గుమ్మడి, టమాట.. లాంటివి వెజిటబుల్ సూప్ చేసుకోవచ్చు. కూరల్లో ఉల్లి, వెల్లుల్లి కలిపితే గుండెకు మంచిది. వెజిటబుల్ స్టిర్ ఫ్రై అనే ఒక పద్ధతి ఉంది. అంటే కూరగాయల్ని కాస్త ఉడికించి తీసి, బాణలిలో కొంచెం నూనె వేసి కాస్త వేయించి తినడం. లేత చిక్కుళ్లు, క్యాబేజి, ఆలుగడ్డ, సొరకాయ, బీరకాయ… ఇలా కూరగాయలన్నిటితో చేసుకోవచ్చు.
వెజిటబుల్ స్టిర్ ఫ్రైకి కాస్త ప్రొటీన్ కలిపి తింటే మరింత మంచింది. అందుకే దీంట్లో ఉడకబెట్టిన శనగలు, ఎగ్‌వైట్, పనీర్, సోయా లాంటివి జోడించి చేస్తే బాగుంటుంది. కూరలు తినలేకపోతే వెజిటబుల్ ప్యూరీలు, సూప్‌లు కూడా ప్రయత్నించొచ్చు.
అన్నంతో ఇష్టంలేకపోతే వామాకు, మెంతి, క్యారెట్‌లాంటి వివిధ ఆకుకూరలు, కూరగాయలతో పరాటాలు చేసుకుని తినొచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. వీటిలోనచ్చినవి ఎంచుకోవచ్చు.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Digestion
- Fiber
- Vegetables
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

