Health Tips | వంటింటి దివ్యౌషధం.. జలుబు నుంచి క్యాన్సర్ దాకా అన్నింటిపై పోరాడే గుణం.. అదేంటో మీకు తెలుసా..?
Health Tips | వంటిల్లు అనేది ప్రతి కుటుంబానికి ప్రకృతి (Nature) ప్రసాదించిన ఫార్మసీ (Pharmacy) లాంటిది. ఎందుకంటే వంటింటి పదార్థాలైన (Kitchen Ingredients) జిలకర, మెంతులు, ఆవాలు, అల్లం, ఎల్లిగడ్డ, లవంగాలు, యాలకులు, మిరియాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి.
వంటిల్లు అనేది ప్రతి కుటుంబానికి ప్రకృతి (Nature) ప్రసాదించిన ఫార్మసీ (Pharmacy) లాంటిది. ఎందుకంటే వంటింటి పదార్థాలైన (Kitchen Ingredients) జిలకర, మెంతులు, ఆవాలు, అల్లం, ఎల్లిగడ్డ, లవంగాలు, యాలకులు, మిరియాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. అందుకే వంటిల్లును ప్రకృతి ప్రసాదించిన ఫార్మసీ అనాలనిపించింది. అయితే ఈ ఫార్మసీలో ఉండే ఒక పదార్థం మాత్రం.. జలుబు (Cold) నుంచి క్యాన్సర్ (Cancer) వరకు ప్రతి అనారోగ్య సమస్యపై పోరాటం చేయగలిగే ఔషధ గుణాన్ని కలిగివుంది. అదేంటా అని ఆలోచిస్తున్నారా..? అదేనండీ.. దాని పేరు లవంగం (Clove). దీన్నే ‘దేవ కుసుమ’ అని కూడా అంటారు. ఈ లవంగంలో ఐరన్‌తోపాటు కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మాంగనీస్, విటమిన్ ఎ, సి ఉంటాయి. లవంగాలను వంటల్లోనే గాక.. కాస్మొటిక్స్, ఔషధాలు, టూత్‌పేస్ట్ తయారీలో కూడా వినియోగిస్తారు.
ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు..
1. లవంగాలకు ఎన్నో దివ్యమైన ఔషధ గుణాలున్నాయి. వీటిని క్రమం తప్పకుండా వాడితే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.
2. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వికారం లాంటివి కూడా పోతాయి.
3. జలుబు, దగ్గు లాంటి సమస్యలకు లవంగం మంచి మందు. నోట్లో ఓ లవంగం వేసుకుని చప్పరిస్తూ ఉంటే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. అంతేగాక లవంగాలను రోజూ తినడం వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు పోతాయి.
5. తలనొప్పి రోజూ భరించలేనిదిగా విసిగిస్తుంటే రోజూ రెండు లవంగాలు తినడంతో ఉపశమనం లభిస్తుంది.
6. పైగా లవంగాలు రక్తపోటు (బీపీ)ను నియంత్రిస్తాయి. మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతాయి.
7. అదేవిధంగా లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పులు, వాపులు, మంటలను తగ్గిస్తుంది.
8. పొట్టలో అల్సర్ సమస్యలకు కూడా లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి.
9. లవంగాలను క్రమం తప్పకుండా తింటే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది.
10. అంతేగాక శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి బరువు తగ్గడానికి కూడా లవంగాలు తోడ్పడుతాయి.
11. లవంగాల్లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారేందుకు ఈ లవంగాలు తోడ్పడుతాయి.
ఇవి కూడా చదవండి..
Health Tips | ప్రతి చిన్న పనికి అలసిపోతున్నారా.. అయితే మీ కూరల్లో ఇది తప్పక ఉండాల్సిందే
Health Tips | కోడిగుడ్డు పచ్చసొన తినాలంటే భయపడుతున్నారా.. అయితే మీరు ఇది చదవాల్సిందే
Beuty Tips | చర్మ సౌందర్యానికి చేమంతి పూలు.. పెదవుల అందానికి గులాబీ నీళ్లు
Beauty Tips | చర్మంపై నల్ల మచ్చలు చికాకు పెడుతున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..
Health Tips | నిత్యం ఆ పని చేస్తే అనారోగ్యం దరిచేరదట.. ఉల్లాసం ఉరకలేస్తుందట..!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

