ఒక బీరువానిండా చీరలు ఉండటం స్టేటస్ సింబల్. రెండు మూడు బీరువాలు నిండితే.. సెలెబ్రిటీ కిందే లెక్క. బహుళ అంతస్తుల భవనంలో.. ఎటు చూసినా చీరలు కనిపిస్తే.. అది బట్టల షోరూమ్ అయినా కావాలి, మ్యూజియం అయినా అయి ఉండాలి. అవును, ఫొటోలో కనిపిస్తున్నది మ్యూజియంలోని చీరకట్టు బొమ్మే. అదీ లండన్లోని డిజైన్ మ్యూజియం. భారతీయులకే ప్రత్యేకమైన ఆహార్యాన్ని ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ప్రదర్శన సెప్టెంబరు చివరి వరకూ ఉంటుంది.