Health Tips | కొత్తగా జిమ్‌కు వెళ్తున్నారా.. ఆహారంలో ఈ మార్పులు చేసుకోవాల్సిందే!
Health Tips | కొత్త ఏడాది నుంచి జిమ్‌కు వెళ్లాలని తీర్మానించుకునేవారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఇలాంటివారు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
Health Tips | కొత్త ఏడాది నుంచి జిమ్‌కు వెళ్లాలని తీర్మానించుకునేవారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఇలాంటివారు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?
– ఓ పాఠకురాలు
జిమ్‌కు వెళ్లడం ద్వారా శరీరానికి మంచి వ్యాయామం అందించవచ్చు. చాలామంది ఈ సమయంలో కఠినమైన డైటింగ్ పాటిస్తారు. దీనికంటే, సమతుల ఆహారం తీసుకోవడమే మేలు. ప్రాసెస్డ్ ఫుడ్స్, మైదా, నూనెలు, డీప్ ఫ్రైలు మానేయాలి. కొందరు రాత్రిపూట సలాడ్స్ లాంటివి తింటారు. ఖాళీ కడుపుతో పడుకొనేవారూ ఉంటారు.
ఇది మంచిది కాదు. ప్రతీ భోజనంలో ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి. క్యారెట్, కీరా ముక్కలు కలిపిన శనగలు, అలసందలు తీసుకోవచ్చు. సలాడ్, సూప్‌లో పనీర్ ముక్కలు, సోయా లాంటివి వేసుకోవచ్చు. తక్కువ తిన్నా సరే, ప్రొటీన్ తప్పకుండా ఉండాలి. జిమ్ చేసేప్పుడు తీవ్రంగా చెమట పడుతుంది. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి. కసరత్తు చేశాక, సహజంగానే ఆకలి అధికం అవుతుంది. ఆ సమయంలో శరీరానికి తగినంత ఆహారం ఇవ్వాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు తప్పక ఉండాలి.
జిమ్ చేసిన 45 నిమిషాలలోపు ప్రొటీన్ తీసుకోవాలి. అందుకోసం ఎగ్‌వైట్స్, ప్రొటీన్ పొడి కలిపిన నీళ్లు, మొలక ల్లాంటివి సరిపోతాయి. వ్యాయామం చేసేప్పుడు మరీ అలసటగా అనిపిస్తే.. పండ్లు, బాదం, కిస్మిస్లాంటివి తిని జిమ్‌కు వెళ్లొచ్చు. క్యారెట్ జ్యూస్ లాంటివీ తాగొచ్చు. వ్యాయామం మధ్యలో నీళ్లు తాగుతూ ఉండాలి. నిమ్మకాయ నీళ్లు, జీరా పానీ లాంటివి ప్రయత్నించొచ్చు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ -పీనట్ బటర్, చికెన్ సూప్ ఈ సమయంలో శరీరానికి మేలు చేస్తాయి. వారంలో మూడుసార్లయినా ఆకుకూరలు తినాలి. ఈ సమయంలో ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

