వంగసీమలో స్విస్ మానవత్వం
చేతి నిండా సంపాదన, ఖరీదైన కారు, విలాసవంతమైన లైఫ్ైస్టెల్, కార్పొరేట్ ప్రపంచంలో తిరుగులేని విజయం. పదహారేండ్ల క్రితం స్విట్జర్లాండ్లో సాండ్రా లావి గోజోవిచ్ జీవిత చిత్రమిది. కానీ, ఆ మెరుస్తున్న లోకం ఆమెను సంతృప్తి పరచలేదు. చుట్టూ ఉన్న పేదరికం, అసమానతలు ఆమె మనసును కలచివేశాయి. దీంతో ఆ సౌకర్యాలన్నిటికీ స్వస్తి చెప్పి, భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆమె అడుగులు ముందుకు వేసింది. ప్రస్తుతం ఇండియాలో తన కలల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న సాండ్రా అంతరగమిది.
చేతి నిండా సంపాదన, ఖరీదైన కారు, విలాసవంతమైన లైఫ్ైస్టెల్, కార్పొరేట్ ప్రపంచంలో తిరుగులేని విజయం. పదహారేండ్ల క్రితం స్విట్జర్లాండ్లో సాండ్రా లావి గోజోవిచ్ జీవిత చిత్రమిది. కానీ, ఆ మెరుస్తున్న లోకం ఆమెను సంతృప్తి పరచలేదు. చుట్టూ ఉన్న పేదరికం, అసమానతలు ఆమె మనసును కలచివేశాయి. దీంతో ఆ సౌకర్యాలన్నిటికీ స్వస్తి చెప్పి, భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆమె అడుగులు ముందుకు వేసింది. ప్రస్తుతం ఇండియాలో తన కలల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న సాండ్రా అంతరగమిది.
భారతదేశం నా సొంతిల్లు లాంటిది అని చెబుతుంది సాండ్రా! పదిహేనేండ్ల కిందట ఇక్కడికి తొలిసారి వచ్చిందామె. ఒక పాఠశాల ప్రారంభించింది. ‘అప్పటి నుంచి స్విట్జర్లాండ్, భారత్ల మధ్య నా సమయాన్ని పంచుకుంటూ వస్తున్నాను. ఈ ప్రయాణం నాకు అంత సులభంగా ఏమీ సాగలేదు. ఒక విదేశీ మహిళగా అనేక సవాళ్లను ఎదురొన్నాను. మొదట్లో ప్రజలు నన్ను నమ్మలేదు. నేనొక విదేశీయురాలినని అనుమానించారు. చాలామంది క్రిస్టియన్ మిషనరీ అని భావించారు.
అయితే, నేను చాలా ఏండ్లుగా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాను. నేటికీ ఈ అపోహలు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి’ అని చెబుతుంది సాండ్రా. ఇండియాకు వచ్చిన తర్వాత రైళ్లలో దేశమంతా పర్యటించింది. పల్లె భారతాన్ని కండ్లారా చూసింది. వివిధ ఎన్జీవోలతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. ఈ ప్రయాణంలో పశ్చిమ్బెంగాల్లోని సాగర్ ద్వీపంలో ఆగిందామె. అక్కడ ప్రాథమిక పాఠశాల నెలకొల్పంది. మహిళల సాధికారత కోసం తనవంతు ప్రయత్నం చేస్తున్నది. గృహ హింస, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాపై వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది.
‘విద్య ద్వారానే పేదరికాన్ని రూపుమాపవచ్చని నా గట్టి నమ్మకం. అయితే భారత్లో నాకు ఎలాంటి ఆదాయ వనరులు లేకపోడంతో నా ఖర్చులను భరించడానికి, అలాగే ఇకడ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి స్విట్జర్లాండ్లో పనిచేస్తూ రెండు దేశాల మధ్యే నా జీవనం సాగిస్తున్నాను. భౌతిక సుఖాలు తాతాలికం. అవి కాస్త సౌకర్యాన్ని ఇస్తాయే తప్ప శాశ్వత సంతృప్తిని ఇవ్వలేవు. తోటివారికి సేవ చేయడం, ఇతరులకు అండగా నిలవడంలోనే జీవితానికి అసలైన అర్థం ఉంది’ అని తన ఆలోచనలు పంచుకున్నది సాండ్రా. తోటి మనుషులకు సేవ చేయడమే జీవిత పరమార్థంగా చెబుతున్న సాండ్రా ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కదా!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

