అందాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం భారీగా ఖర్చు చేసేస్తుంటారు కూడా! అయితే, చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి. సన్‌స్క్రీన్ లోషన్స్ బయటికి వెళ్లినప్పుడే రాసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ, ఇంటిలోపల కూడా యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందువల్ల ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ లోషన్స్ వాడటం మంచిది. అలాగే.. మేకప్ బ్రష్‌లను రెగ్యులర్‌గా శుభ్రం చేస్తుండాలి. లేకుంటే, అందులో బ్యాక్టీరియా చేరి, చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఇక మరికొందరైతే రాత్రిపూట మేకప్ తీయకుండానే పడుకుంటారు. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాలు మూసుకుపోయి.. మొటిమలు, డల్ స్కిన్‌కు దారితీస్తుంది. అందుకని పడుకునే ముందు మేకప్ తీయడం ఉత్తమం. ముఖాన్ని ఎక్కువసార్లు కడగడం కూడా ఇబ్బంది తెచ్చిపెడుతుంది. చర్మంలోని సహజసిద్ధమైన నూనెలను కోల్పోవాల్సి వస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. అందువల్ల రోజుకు రెండుసార్లు మాత్రమే ముఖాన్ని కడుక్కోవడం అలవాటు చేసుకోండి. మరో విషయం.. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా.. చర్మానికి హాని కలుగుతుంది కూడా! అందుకే, వాటిని వాడటం ఏమంత మంచిది కాదు.