నిద్ర లేమికి స్మార్ట్ పరిష్కారం!
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘నిద్రలేమి’. రోజంతా కష్టపడినా రాత్రి పరుపుపై చేరినా కళ్లు తెరుచుకునే ఉంటున్నాయి. ఈ సమస్యకు మందులు వాడకుండా, కేవలం ఒక మొబైల్ యాప్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘నిద్రలేమి’. రోజంతా కష్టపడినా రాత్రి పరుపుపై చేరినా కళ్లు తెరుచుకునే ఉంటున్నాయి. ఈ సమస్యకు మందులు వాడకుండా, కేవలం ఒక మొబైల్ యాప్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపవచ్చని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి. అమెరికాలోని ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తలు ఈ వినూత్న పరిశోధనను చేపట్టారు. ప్రముఖ స్లీప్ మెడిసిన్ నిపుణులు, సైకాలజిస్టులతో కూడిన ఐదుగురు సభ్యుల బృందం ఈ అధ్యయనాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్న 300 మంది వ్యక్తులను ఎంపిక చేశారు. వీరంతా 25 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు గలవారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ఉద్యోగ ఒత్తిడి కారణంగా నిద్ర కోల్పోతున్న వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వయసు వారిని ఎంపిక చేశారు.
పరిశోధకులు వీరికి ‘స్లీప్ హెల్దీ‘ అనే ప్రత్యేక డిజిటల్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ యాప్‌ను అందించారు. తొమ్మిది వారాల పాటు జరిగిన ఈ ప్రయోగంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. యాప్ ఉపయోగించిన వారిలో 75% మంది పరుపుపై చేరిన 15 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకున్నారు. రాత్రి పూట పదే పదే మేల్కొనే సమస్య 60% వరకు తగ్గింది.
ఉదయం లేవగానే అలసట తగ్గి, రోజంతా ఉత్సాహంగా ఉన్నట్లు పాల్గొన్నవారు తెలిపారు. మానసిక అలవాట్లను మార్చడం ద్వారా నిద్రను సహజంగా ఎలా రప్పించవచ్చో ఈ యాప్ నేర్పుతుంది. నిద్ర కోసం మాత్రలు వాడి సైడ్ ఎఫెక్ట్‌లను తెచ్చుకునే కంటే, ఇలాంటి డిజిటల్ చికిత్సలు ఎంతో సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికతను సరిగ్గా వాడుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ఈ పరిశోధన నిరూపిస్తున్నది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

