rangoli_with_geetha .. రంగవల్లికల చిత్రకారిణి గీతా సురేశ్ గీతల జగత్తు. ఆమె పనిగట్టుకుని రంగులు పులమరు. ఆర్భాటాలకు ఆస్కారం ఇవ్వరు. గీతా సురేశ్ ముగ్గుల అల్లికలో తనదైన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అవన్నీ మన అమ్మలు, అమ్మమలు వేసిన అచ్చమైన రంగవల్లులు. ముగ్గుపిండి తప్పితే మరో ముడిపదార్థం వాడిన దాఖలాలు కనిపించవు. ఆ నిరాడంబరతలోనే నిజమైన అందం ఉంది.