ఆన్లైన్ షాపింగ్ ముచ్చట పరిచయమైంది మొదలు.. హాట్ డీల్స్‌పైనే అందరి చూపు. రోజూ ఏమేం డీల్స్ ఉన్నాయో చెక్ చేస్తుంటాం. నచ్చితే చాలు.. ఆర్డర్ పెట్టేస్తుంటాం. అలాంటి డీల్ ఒకటి పోకో స్మార్ట్‌ఫోన్‌పై ఉంది. స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, ఆ డీల్ మీ కోసమే!
నియో మోడల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను మొదట్లో 19,999కి విడుదల చేశారు. కానీ, ఇప్పుడు 11,999కే అందుబాటులో ఉంది. అంటే నేరుగా 4,000 తగ్గింపు. SBIక్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అదనంగా 1,000 తక్షణ తగ్గింపు ఉంది. ఇంకా కావాలంటే పాత ఫోన్‌ను మార్పిడి చేస్తే, అదనంగా 11,300 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. ఇక ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. డిస్ప్లే పరిమాణం 6.67-అంగుళాల ఫుల్ HD+ AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్. హై-స్పీడ్ పనితీరుకోసం MediaTek Dimensity 6080 ప్రాసెసర్‌ని వాడారు. కెమెరా సామర్థ్యం.. 108MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా. 5000mAh బ్యాటరీ. 33W ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది. హారిజాన్ బ్లూ, ఆస్ట్రల్ బ్లాక్, మార్షియన్ ఆరెంజ్ రంగుల్లో దొరుకుతుంది.
దొరికే చోటు: https://tinyurl.com/2ykjf3y7
చిన్న హాలీడే వెకేషన్ దొరికితే చాలు.. టీన్స్ మాత్రమే కాదు.. ఫ్యామిలీస్ కూడా జాయ్‌ఫుల్ మూడ్‌లోకి వచ్చేస్తున్నారు. మ్యూజిక్ మస్తీ చేస్తుంటారు. అలాంటి మ్యూజిక్ లవర్స్ కోసం మర్చిపోలేని అనుభూతిని అందించేందుకు Pebble Vibe స్పీకర్ రెడీగా ఉంది. ఇది మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ.. ట్రెండింగ్‌గా నిలుస్తున్నది. 18W డీప్ బాస్ సౌండ్‌తో పాటలు వింటూ ప్రతి బీట్‌ను ఆస్వాదించేలా దీన్ని రూపొందించారు. దీంట్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. RGB LED లైట్ షో! మ్యూజిక్ ట్రాక్స్ ప్లే చేస్తూనే.. మీరు ఉన్న చోటును మినీ డిస్కోటెక్గా మార్చేస్తుంది. అంటే.. మీ జోష్ని మరింత కలర్ఫుల్గా మార్చేస్తుంది.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌తో సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ మోడ్‌లోనే కాకుండా.. ఆక్స్ కేబుల్‌తో కూడా మ్యూజిక్ ట్రాక్స్ ప్లే చేయవచ్చు. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. దీన్ని ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 5 గంటల వరకు ప్లే టైమ్ అందిస్తుంది. ప్రస్తుతం Pebble Vibe భారీ డిస్కౌంట్‌తో కేవలం 2,299కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర 9,999. అధికారిక సైట్ నుంచి కొనుగోలు చేస్తే కూపన్‌తో మరికొంత డిస్కౌంట్ పొందొచ్చు.
దొరికేచోటు: https://tinyurl.com/3kwbw7a4
కచ్చితంగా స్మార్ట్ఫోనే వాడాలి.. కానీ, ధర మాత్రం బడ్జెట్లోనే ఉండాలి!! మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా వినిపించే డైలాగ్ ఇది. అందుకే ఫోన్ తయారీ సంస్థలు కూడా ప్రీమియం ఫోన్లతోపాటు బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ కూడా అందిస్తున్నాయి. ఇన్ఫినిక్స్ సంస్థ కూడా ఇదే సెగ్మెంట్లో తనదైన ముద్ర వేస్తున్నది. అలాంటి ఒక ఆకర్షణీయమైన మోడల్‌ను తాజాగా దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం రూ.6,699కే భారీ స్క్రీన్, డ్యూయల్ స్పీకర్లు, పవర్ఫుల్ బ్యాటరీ వంటి ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నది. ఫిబ్రవరి 4 మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkartలో కొనుగోలు చేయొచ్చు.
ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్లో బెస్ట్ చాయిస్‌గా నిలవనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫీచర్ల విషయానికి వస్తే… 6.7 అంగుళాల HD+ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్‌ను అందిస్తుంది. 5000mAh బ్యాటరీతో ఫోన్‌ని రోజంతా వాడొచ్చు. 13MP బ్యాక్ కెమెరా.. 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. MediaTek Helio G50 ప్రాసెసర్‌ని వాడారు. 3GB + 3GB ఎక్స్టెండెడ్ RAM, 64GB స్టోరేజ్ వినియోగదారులకు ల్యాగ్‌లెస్ అనుభూతిని అందిస్తాయి. DTS సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లు పనిచేస్తాయి. IP54 రేటింగ్‌తో అన్ని రక్షణ కవచాల్నీ ఫోన్‌కి ఏర్పాటుచేశారు.
దొరికే చోటు: https://tinyurl.com/bdffw7cm
ఇప్పుడు అందరి ఇళ్లలోనూ స్మార్ట్ టీవీలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీవీల నుంచి మంచి మ్యూజిక్ ఔట్పుట్ కోసం సౌండ్ బార్లను వెతికేస్తున్నారు. అలాంటి వారికి కాస్త తక్కువ ధరకే డాల్బీ సౌండ్ బార్‌ను ఈ-గేట్ వరల్డ్ అందిస్తున్నది. Egate Enigma 315D మోడల్ డాల్బీ సౌండ్ బార్ని అతి తక్కువ ధరకి అందుబాటులో ఉంచింది. Enigma 315D సౌండ్ బార్ ఇప్పుడు Flipkartలో 68% తగ్గింపుతో కేవలం 4,990కే దొరుకుతున్నది.
300W పవర్ఫుల్ సౌండ్ Dolby Audio టెక్నాలజీ, 2.1 చానెల్ సెటప్‌తో పనిచేస్తుంది. AUX, USB, HDMI Arc, ఆప్టికల్, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్లతో ఇతర స్మార్ట్ డివైజ్లకూ ఈ సౌండ్ బార్ని కనెక్ట్ చేయొచ్చు. EQ మోడ్స్, పవర్ఫుల్ సబ్‌వూఫర్ ఉండటంతో థియేటర్ లెవల్ సౌండ్ అనుభూతిని అందిస్తుంది.
దొరికే చోటు: https://tinyurl.com/238yk72w