Health Tips | రజస్వల అయినప్పుడు కారం తింటే.. సమస్యలు తలెత్తుతాయా?
Health Tips | నమస్తే మేడం. రజస్వల సమయంలో చప్పటి ఆహారం పెట్టాలని పెద్దలు చెబుతుంటారు. కారం కనుక తింటే.. భవిష్యత్తులో నెలసరి నొప్పి, ఇతర సమస్యలు తలెత్తుతాయా? మా అమ్మాయికి 14 ఏండ్లు. తన కడుపునొప్పికి కారణం.. రజస్వల అయినప్పుడు కారం తినడమేనా?
నమస్తే మేడం. రజస్వల సమయంలో చప్పటి ఆహారం పెట్టాలని పెద్దలు చెబుతుంటారు. కారం కనుక తింటే.. భవిష్యత్తులో నెలసరి నొప్పి, ఇతర సమస్యలు తలెత్తుతాయా? మా అమ్మాయికి 14 ఏండ్లు. తన కడుపునొప్పికి కారణం.. రజస్వల అయినప్పుడు కారం తినడమేనా?
– ఓ పాఠకురాలు
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే… రజస్వల కావడానికి, ఆ సమయంలో తినే ఆహారానికి అసలు సంబంధం లేదు. కారాలు తినకూడదన్న నియమం అసలే లేదు. చక్కని పౌష్టికాహారాన్ని రుచిగా వండి పెట్టొచ్చు. మనం ఈ సందర్భంగా నువ్వులు, బెల్లంలాంటి క్యాల్షియం, ఐరన్ ఉండే పదార్థాల్ని పెడతాం. అది పిల్లలకు ఎంతో మంచిది. ఎందుకంటే పుష్పవతి అయిన ఆరునెలల దాకానే పిల్లలు ఎత్తు పెరుగుతారు. తర్వాత పెరుగుదల నెమ్మదిస్తుంది.
అందుకే ఈ సమయంలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, పీచులు కలగలిపిన సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడం ఎంతో ముఖ్యం. మంచి వ్యాయామమూ అవసరం. కాబట్టి మీ అమ్మాయి కడుపు నొప్పికి, ఆ సమయంలో తీసుకున్న ఆహారానికి ఎలాంటి సంబంధం లేదు. నొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ను సంప్రదించండి. పరీక్షలు చేసి, తగిన సూచనలిస్తారు. హాట్ప్యాక్ లాంటివి పొట్టమీద పెడితే కూడా కొంత ఉపశమనం ఉంటుంది.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- pain
- periods
- Periods Pain
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

