ఫోన్లో యాప్‌లే కాదు.. వెబ్ విహారానికి వాడే బ్రౌజర్లు కూడా ఏఐ సపోర్ట్‌తో ముందుకొస్తున్నాయి. బ్రౌజింగ్‌లోనూ వినూత్నమైన ఫీచర్స్ పరిచయం అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ‘కోపైలట్’ ఇలాంటి ఫీచరే! మనం బ్రౌజర్ వాడుతున్నప్పుడు చాలా ట్యాబ్‌లు ఓపెన్ చేస్తుంటాం. వాటిని పదే పదే యాక్సెస్ చేయడం విసుగు తెప్పిస్తుంది. ‘కోపైలట్’ మోడ్ ఎంపిక చేసుకుంటే బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా మారిపోతుంది. కోపైలట్ చాట్‌బాట్‌ను ఉపయోగించి ఓపెన్ చేసిన అన్ని ట్యాబ్స్‌ను సులభంగా మేనేజ్ చేయొచ్చు. అన్ని ట్యాబ్‌లను ఎక్స్ప్లోర్ చేస్తూ.. రెస్టారెంట్ బుకింగ్‌లు, ప్రొడక్ట్ కంపారిజన్లు, కంటెంట్‌ను సమ్మరైజ్ చేయడం.. లాంటి పనులు క్షణంలో చక్కబెట్టొచ్చు. వేర్వేరు ట్యాబ్‌లలో ఓపెన్ చేసిన హోటల్ లిస్టింగ్‌లను పోల్చవచ్చు.
ఈ-షాపింగ్‌లో ఉత్తమ ప్రొడక్ట్‌ను ఎంచుకోవడానికి సాయం తీసుకోవచ్చు. వీటన్నిటికీ మీరు ట్యాబ్‌లను మార్చాల్సిన అవసరం లేదు. ఒకే క్లిక్‌తో అన్ని పనులూ జరిగిపోతాయి. అంతేకాదు.. వాయిస్ కమాండ్స్‌తో బ్రౌజర్‌ని ఆపరేట్ చేయొచ్చు. దీంతో బ్రౌజర్‌తో ఇంటరాక్ట్ అవ్వడం చాలా సులభం అవుతుంది. ఈ ఏఐ అసిస్టెంట్ యూజర్లకు సందర్భోచితంగా సాయం చేస్తుందన్నమాట. కోపైలట్ గురించి ఎడ్జ్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ సీన్ లిండర్సే మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో ఈ మోడ్ యూజర్ల వర్క్‌ఫ్లోకు అనుగుణంగా టాపిక్-బేస్డ్ జర్నీని రూపొందించడానికి సహాయపడుతుంది.
యూజర్ పర్మిషన్తో, బ్రౌజర్ హిస్టరీ, క్రెడెన్షియల్స్‌ను కూడా యాక్సెస్ చేసే సామర్థ్యాన్ని కోపైలట్ మోడ్‌కు ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్ చేస్తున్నద’ని చెప్పుకొచ్చారు. సింపుల్‌గా చెప్పాలంటే.. కోపైలట్ మోడ్ రాకతో బ్రౌజింగ్ మరింత సులభంగా, వ్యక్తిగతంగా మారుతుందన్నమాట! అయితే, ఏఐ అందించే సమాచారంలో కొన్నిసార్లు తప్పులు ఉండవచ్చు. కాబట్టి, ఏదైనా చర్య తీసుకునే ముందు, వాస్తవాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం ముఖ్యమని మైక్రోసాఫ్ట్ హెచ్చరిక చేయడం గమనార్హం.