ఇదోఆన్లైన్ బ్రాండ్. మహిళలకు ప్రత్యేకం. ఇక్కడ స్నీకర్స్, ైస్లెడ్స్తోపాటు వధువుల పాదరక్షలు కూడా లభిస్తాయి. స్థాపించి ఏడాది కూడా కాకుండానే సంచలనాలు సృష్టిస్తున్నది. మాళవిక సక్సేనా అనే ఆంత్రప్రెన్యూర్ ఆలోచన ఫలితమే.. క్విర్కీ నారి.
యూపీలోని మథుర ఆమె జన్మస్థలం. అక్కడే ఎంబీయే చేసింది. చదువుకునే రోజుల్లో పర్యావరణానికి హానికలిగించని ఫ్యాషన్ పరిశ్రమను స్థాపించాలనేది మాళవిక ఆలోచన. అందులో భాగమే క్విర్కీ నారి. ఆ డిజైన్లు చూసి ముచ్చటపడి దీపిక పదుకోన్ బ్రాండ్ రాయబారిగా మారింది. ‘మొదట్లో.. సగం ధర మాత్రమే చెల్లించండి. మిగతాది వాడి చూసి ఇవ్వండి’ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది మాళవిక. ఆ ప్రయోగం విజయవంతమైంది.