జీన్స్ ఫ్యాషన్ మనకేనా, మన చేతుల్లో ఎప్పుడూ ఎత్తుకు తిప్పే, మన ఒడిలో నిరంతరం ఓలలాడే ల్యాప్‌టాప్‌కు మాత్రం వద్దా… అని అనుకున్నారు ముద్దుగుమ్మలు. అందుకే ల్యాప్‌టాప్ కవర్గానూ డెనిమ్నే వాడుతున్నారు. చిత్రంలో కనిపిస్తున్న బ్యాగు ఆ కోవలోనిదే. ‘అప్సైకిల్డ్ డెనిమ్ ల్యాప్‌టాప్ కవర్లు’గా పిలుస్తున్న వీటిని.. వాడి పడేసిన జీన్స్‌తో తయారు చేస్తున్నారు.
జిప్, భుజానికి తగిలించుకునే స్ట్రాప్‌తో చూడగానే ట్రెండీ లుక్‌తో కనిపిస్తున్నాయి. జీన్స్‌ను బట్టి రకరకాల మాడళ్లు ఉంటాయి. నిజానికి, ఓ డెనిమ్ ప్యాంట్ తయారీకి వంద బకెట్ల నీళ్లు అవసరం అవుతాయట. వాటిని వీలైనంత ఎక్కువకాలం ఉపయోగిస్తే.. నీటిని ఆదా చేసినవాళ్లం అవుతాం. పునర్వినియోగిస్తే జీన్స్నూ ఆదా చేసినవాళ్లం అవుతాం.