ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచాన్ని ‘కొరియన్ స్టైల్’ ఊపేస్తున్నది. దుస్తుల దగ్గర నుంచి మేకప్ వరకు అంతా కొరియన్ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారు. అందులోనూ ఇప్పుడు అమ్మాయిల జుట్టుకు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తూ, టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సరికొత్త యాక్సెసరీ… ‘బో హెయిర్ క్లిప్’. ఒకప్పుడు చిన్న పిల్లలు మాత్రమే పెట్టుకునే ఈ రిబ్బన్ బోలు, ఇప్పుడు సరికొత్త డిజైన్లలో రీ-ఎంట్రీ ఇచ్చి కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్ వరకు అందరినీ ఫిదా చేస్తున్నాయి. వెల్వెట్, శాటిన్, ఆర్గంజా, నెట్ ఫ్యాబ్రిక్‌లతో తయారవుతున్న ఈ పెద్ద పెద్ద బో క్లిప్పులు జుట్టుకు రాయల్ అండ్ క్యూట్ లుక్‌ని ఇస్తాయి.
ముఖ్యంగా ముత్యాలు, చిన్న చిన్న రాళ్లు పొదిగిన మోడళ్లు ఇటు సంప్రదాయ దుస్తులకూ, అటు మోడ్రన్ వెస్ట్రన్ వేర్‌కూ పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి. జుట్టును లూజ్‌గా వదిలేసి హాఫ్-అప్ హెయిర్ ైస్టెల్ వేసినా, లేదా హై పోనీటెయిల్ కట్టినా… కేవలం ఈ ఒక్క ‘బో క్లిప్’ పెడితే చాలు, క్షణాల్లో మన లుక్ క్లాసీగా మారిపోతుంది. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలనుకునే వారికి ఈ కొరియన్ బో ఒక బెస్ట్ చాయిస్!