Apps:
Follow us on:

Brushing Tips | బ్రష్‌ చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా?

1/6Brushing Tips | ఉదయాన్నే చేసే పనుల్లో దంతాల శుభ్రత చాలా ముఖ్యమైనది. దీన్ని ఇష్టానుసారంగా చేయడం వల్ల పళ్లపై ఉండే ఎనామెల్‌ పొర కరిగిపోయి, దంతాలు బలహీనంగా తయారవుతాయని డెంటిస్టులు చెబుతున్నారు. బ్రష్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పలు టిప్స్‌ సూచిస్తున్నారు.
2/6చాలామందికి రోజులో ఒకసారి మాత్రమే బ్రష్ చేయటం అలవాటు. అలా కాకుండా సాయంత్రం పూట కూడా బ్రష్ చేయటం అలవాటు చేసుకోవాలి.
3/6బ్రష్, టూత్‌పేస్టుల ఎంపికలోనూ జాగ్రత్తలు పాటించాలి. నాణ్యమైనవాటినే వాడాలి. ఒకే బ్రాండ్‌ను వాడాలి. ప్రతిసారి కొత్తబ్రాండ్ వస్తువులను వాడటం వల్ల కూడా సమస్యలు ఎదురవుతాయట.
4/6ముఖ్యంగా దంతాల మధ్య భాగంలో ఆహారం ఇరుక్కుపోతుంది. అక్కడే బ్యాక్టీరియా చేరుతుంది. కాబట్టి పండ్ల మధ్యభాగంలో బాగా శుభ్రం చేయాలి.
5/6ఒకే బ్రష్‌ను కూడా ఎక్కువ కాలం వాడటం మంచిది కాదు. వీలైనంత త్వరగా బ్రష్‌ను మార్చాలి.
6/6టంగ్ క్లీనర్లు ఉపయోగించి నాలుకను శుభ్రపరచాలి. అలా అని టంగ్‌ క్లీనర్‌తో నాలుకపై బలంగా రుద్దకూడదు. మృదువుగా వాడాలి. గట్టిగా రుద్దడం వల్ల నాలుకపై ఉండే రుచిగులికలు పోయే ప్రమాదం ఉంది.