Kalpana Iyer : భారతీయ సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉన్న పాట రంబా హో హో. 1981లో విడుదలైన బాలీవుడ్ మూవీ అర్మాన్ సినిమాలోనిది ఈ పాట. శక్తి కపూర్, ప్రేమ నారాయణ్ నటించారు. ఈ పాటకు బప్పీలహిరి సంగీతం అందించగా, ఉషా ఉతుప్ పాడారు. ఈ స్పెషల్ డిస్కో సాంగ్‌లో నటించింది కల్పనా అయ్యర్.
ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకూ అంటే.. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఈ పాటకు ఒరిజినల్ నటి అయిన కల్పనా మళ్లీ డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటీవల విడుదలైన దురంధర్ మూవీ ద్వారా ఈ పాట మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. నేటి యూత్‌కు కూడా ఈ పాట బాగా ఎక్కింది. తాజాగా ఒక పెళ్లి వేడుకలో కల్పనా అయ్యర్ తన పాటకు తనే డాన్స్ చేశారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత రంబా హో హో అనే పాటకు స్టేజిపై ఉత్సాహంగా డాన్స్ చేశారు.
ఆమె డాన్స్ మూవ్స్ చూస్తుంటే తనకు ఇప్పుడు 69 ఏళ్లు అంటే ఇప్పుడు ఎవరూ నమ్మలేరు. అంతబాగా అలవోకగా డాన్స్ చేస్తూ అక్కడివారిని అలరించారు. ఆమె స్టెప్స్‌కు అక్కడున్నవారు కూడా ఎంజాయ్ చేస్తూ పాదం కదిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందరూ కల్పనా అయ్యార్ ఎనర్జీని పొగుడుతున్నారు.