స్వచ్ఛతకు తెలుపు చిహ్నమైతే, గులాబీ ప్రేమకు ప్రతిబింబం. ఈ రెండిటి కలయిక ఎంత హాయిగొలుపుతుందో… ఆ రంగుల మేళవింపూ అంతే మనోహరంగా ఉంటుంది. మల్లెపూల సౌకుమార్యాన్నే దన్నుగా చేసుకుని తీగ గులాబీ విరబూసినట్టు కనిపిస్తున్నది.. బ్రాసో సోయగాన్ని సంతరించుకున్న ఈ షిఫాన్ క్రేప్ చీర.
దానికి సరిజోడుగా ధవళ వర్ణపు సోయగాల్లో ఫ్రెంచ్ లేస్ వ్రస్త్రంతో రూపొందిన జాలీ జాకెట్టు అందానికే అందంలా కనువిందు చేస్తున్నది. ఈ చీర కట్టుకుని వేసవి వేడుకలో వెన్నెల వెలుగై తళుకులీనుతున్నది.. సింగర్ మంగ్లీ