Portrait Jewellery | మళ్లీ మెరిసిపోతున్నాయ్.. పోట్రెయిట్ నగలపై మగువల కన్ను
ఇష్టమైన వ్యక్తి జ్ఞాపకం పదిలంగా ఉంచుకోవడం మానవ సహజం. నచ్చిన చిన్నదాని చిత్తరువును పాకెట్లో భద్రపరుచుకునే రోజుల నుంచి మొబైల్ స్క్రీన్ సేవర్‌గా పెట్టుకునే స్థాయికి వచ్చేశాం. అతివల విషయానికి వస్తే.. తీపి గుర్తులను నగల్లో పొదిగితేనే వారికి అమితానందం.
Portrait Jewellery | ఇష్టమైన వ్యక్తి జ్ఞాపకం పదిలంగా ఉంచుకోవడం మానవ సహజం. నచ్చిన చిన్నదాని చిత్తరువును పాకెట్లో భద్రపరుచుకునే రోజుల నుంచి మొబైల్ స్క్రీన్ సేవర్‌గా పెట్టుకునే స్థాయికి వచ్చేశాం. అతివల విషయానికి వస్తే.. తీపి గుర్తులను నగల్లో పొదిగితేనే వారికి అమితానందం. తమకు ఇష్టమైన వ్యక్తులు, జంతువుల ప్రతిబింబాలున్న లాకెట్లను నగకు తగిలించి హృదయానికి దగ్గరగా చోటిస్తున్నారు. పోట్రెయిట్ జువెలరీగా పేరెన్నికగన్న ఈ నగలు ప్రాచీనకాలం నుంచి మనుగడలో ఉన్నవే! ఈ తరం మగువల కన్నుపడటంతో పోట్రెయిట్ నగలు మళ్లీ మెరిసిపోతున్నాయి. కొత్త డిజైన్లతో అలరిస్తున్నాయి.
జమీందారు కొడుకు చిన్నప్పుడే తప్పిపోతాడు. అతని మెడలో ఓ లావుపాటి గొలుసు. దానికి అంగుళం మందం ఉన్న లాకెట్. ఓపెన్ చేస్తే.. అందులో జమీందారు దంపతుల చిత్తరువులు. ఈ ముచ్చట చెబుతుంటే ఈస్ట్‌మన్ కలర్ జమానాలో వచ్చిన తెలుగు సినిమాలు కండ్లముందు కదలాడుతున్నాయి కదా! తప్పిపోయిన ఆ బుడతడు హీరో కావడం, తనను పెంచినవారు కన్నుమూస్తూ ఆ లాకెట్‌ను అతగాడికి అప్పగించడం, దాన్ని ఆధారంగా చేసుకొని హీరో తన అమ్మానాన్నల్ని కలుసుకోవడం.. ఇదీ కథ! ఈ స్క్రిప్ట్‌కు ప్రాణం ఆ లాకెట్.
అయినవారి ప్రతిరూపాలు అద్దుకున్న ఆ లాకెట్లు ఫ్యాషన్ ప్రపంచంలో మళ్లీ రాజ్యమేలుతున్నాయి. వారి ఫొటోలకు పోట్రెయిట్ హంగులు కూర్చి నచ్చిన నగకు తగిలించుకుంటున్నారు ఈ తరం ముదితలు. డిజిటల్ ఫినిషింగ్‌తో పోట్రెయిట్ జువెలరీకి కొత్తదనం ఆపాదిస్తున్నారు. ఈ జ్ఞాపకాల లాకెట్లను బంగారు గొలుసుతో కట్టేసి సింగారించుకుంటున్నారు. అంతేకాదు టెర్రకోట, ఫ్యాబ్రిక్, థ్రెడ్ జువెలరీలోనూ వీటికి చోటిచ్చి వేడుక చేసుకుంటున్నారు. ఇష్టమైన వ్యక్తుల ప్రతిబింబాలే కాదు.. రాధాకృష్ణులు, పక్షులు, అందమైన ప్రకృతి దృశ్యాలను కూడా లాక్ చేసి లుక్ ఎట్ మీ అని సంబురపడుతున్నారు అతివలు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

