HomeLifestyleInterchangeable Stone Rings Provide An Opportunity To Wear That Color Stone With Any Color Dress
రంగు మార్చే రింగు!
ఉంగరాలు రోజూ పెట్టుకుంటాం. డ్రెస్లూరోజూ వేసుకుంటాం. అంతమాత్రాన ఉంగరానికి, డ్రెస్సుకు మ్యాచింగ్ అవసరం లేదనుకుంటామా? ఆకుపచ్చ రంగు డ్రెస్ మీద పసుపు పచ్చ రాయి రింగ్ పెట్టుకుంటామా? అబ్బే అస్సలు కుదరదు.
ఉంగరాలు రోజూ పెట్టుకుంటాం. డ్రెస్లూరోజూ వేసుకుంటాం. అంతమాత్రాన ఉంగరానికి, డ్రెస్సుకు మ్యాచింగ్ అవసరం లేదనుకుంటామా? ఆకుపచ్చ రంగు డ్రెస్ మీద పసుపు పచ్చ రాయి రింగ్ పెట్టుకుంటామా? అబ్బే అస్సలు కుదరదు. అలా అని రోజుకో ఉంగరం మార్చాలన్నా కష్టమే. అందుకే ఒకటే ఉంగరం పెట్టుకుని, ఏ రంగు డ్రెస్ వేసుకుంటే ఆ రంగు రాయి ధరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ‘ఇంటర్ చేంజబుల్ స్టోన్ రింగ్స్’.
మిలానోలాంటి వివిధ సంస్థలు తయారు చేస్తున్న వీటిలో ఎన్నో డిజైన్లు వస్తున్నాయి. వాటితో పాటు స్క్రూ తిప్పి బిగించుకోగలిగే రాళ్లూ ఉన్నాయి. ఇంకేం, ఒక ఉంగరం కొనుక్కుంటే అన్ని దుస్తుల మీదికీ మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకోవచ్చు. ఫ్యాషన్‌గా కనిపించొచ్చు.