మేరా ప్యారా తిరంగా జెండా… అని గుండెల నిండా పాడుకునే రోజు పంద్రాగస్టు. అరుణ భాస్కర కోటి కిరణాల కాంతితో ధగధగా మెరిసే మూడు రంగుల పతాకం… భారతావనిని ముద్దాడే రోజూ నేడే. ఆనాడు మువ్వన్నెలు ఎంతో ప్రత్యేకం. స్వతంత్ర పోరాటంలో పాల్గొనకపోయినా, ప్రతి గుండే దాన్ని అనుభూతి చెందే విశిష్ట సందర్భమిది.
అందుకే ఈ రోజు మన ఒంటి మీదా మువ్వన్నెలు మెరవాలని ముచ్చట పడతాం. జెండా పండుగ మనలోనూ ప్రతిఫలించాలని ఆశ పడతాం. జనం మనసెరిగిన ఫ్యాషన్ ఈ సమయాన మువ్వన్నెల మువ్వ కడుతుంది. జెండా రంగుల్ని అభినయంగా ఆవిష్కరిస్తుంది. అందుకే దుస్తులు, నగలు త్రివర్ణ రాగాలు పాడతాయి.
చుడీదార్, చీర, గౌన్లు మొదలు గాజులు, గొలుసులు, దుద్దులు, బ్రేస్లెట్ల దాకా అన్నింటా జెండా రంగులు రంజిల్లుతాయి. ఒక్క జెండా స్తంభానే కాదు, ఊరూవాడా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో కళకళల్లాడుతూ కనిపిస్తాయి. భరతభూమి మువ్వన్నెల వసంతమాడుతుంది!
Indi