Stock Market | దలాల్ స్ట్రీట్ క్వీన్ మీరే.. స్టాక్మార్కెట్లో సత్తా చాటుతున్న మహిళలు
ఇటీవలి కాలంలో భారతీయ స్టాక్మార్కెట్లో మహిళలూ సత్తా చాటుతున్నారు. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పదాలు పురుషులకే ప్రత్యేకం అనే ఇనుపతెరలను బద్దలు కొడుతున్నారు.
Stock Market | ఇటీవలి కాలంలో భారతీయ స్టాక్మార్కెట్లో మహిళలూ సత్తా చాటుతున్నారు. ట్రేడింగ్,
ఇన్వెస్ట్మెంట్ పదాలు పురుషులకే ప్రత్యేకం అనే ఇనుపతెరలను బద్దలు కొడుతున్నారు. స్టాక్‌మార్కెట్ నియంత్రణ సంస్థ అధిపతి మాధబి పురి బుచ్, విజయవంతమైన ఐపీఓతో నైకా సీఈవో ఫల్గుణి నాయర్ స్టాక్మార్కెట్లో మహిళల ఘనవిజయాలకు ఉదాహరణలుగా నిలుస్తారు. గతంతో పోలిస్తే స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న మహిళల సంఖ్య పెరుగుతుండటం వీరిని పురుషుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇలాంటి సమయంలో స్టాక్‌మార్కెట్ వ్యవహారాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరిగేలా వారిలో చైతన్యం తీసుకురావాలంటున్నారు ట్రేడింగ్ నిపుణులు.
స్టాక్మార్కెట్లో ట్రేడింగ్ అంటే పురుషులకే ప్రత్యేకం అనుకుంటారు. ఆ అపోహను దూరంచేస్తూ భారతీయ మార్కెట్లో మహిళలు కూడా రాణిస్తున్నారు. ఫిడెలిటీ 2023 సర్వే ప్రకారం 60 శాతం మంది మహిళలు స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. 68 శాతం మంది రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకుంటున్నారు. ఇక నవతరం యువతులు 71 శాతం మంది వరకు స్టాక్మార్కెట్లో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో పురుషులతో పోలిస్తే మహిళలు సహజంగానే పొదుపరులు కావడం దీనికి కారణం. ఇది వారికి మార్కెట్లో ఇన్వెస్టింగ్‌కు అధిక సామర్థ్యాన్ని సమకూర్చి పెడుతుంది.
అయితే, ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండే ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పొదుపు ఒక్కటి మాత్రమే సరిపోదు. పొదుపునకు మదుపు జోడిస్తేనే డబ్బు విలువ పెరుగుతుంది. అలా ద్రవ్యోల్బణాన్ని దాటుకుని మన ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు. మహిళల్లో భావోద్వేగాలను అదుపు చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. స్వల్పకాలంలో తలెత్తే మార్కెట్ ఒడుదొడుకులకు వాళ్లు తేలిగ్గా లొంగిపోరు. ఈ కారణాల వల్ల పెట్టుబడుల రంగంలో కూడా మహిళలు రాణించవచ్చు.
ఇన్వెస్టింగ్ రంగంలో మహిళలు బాగానే రాణిస్తున్నారు. అయితే, ట్రేడింగ్‌లో మాత్రం వారి పాత్ర కొంచెమే. ట్రేడింగ్ మహిళలకు అంతగా సరిపడని రంగంగా భావించడమే ఈ పరిస్థితికి కారణం. దీనికి తోడు ఆర్థిక వ్యవహారాలు, స్టాక్‌మార్కెట్ పెట్టుబడులలో తమకంటే పురుషులే బాగా సరిపోతారన్న అపోహతోనే ఈ రంగంలో అడుగుపెడతారు. కానీ, ఇది ఆడ, మగకు సంబంధించిన అంశం కానేకాదు. కాబట్టి ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ రంగాల్లో మరింతమంది మహిళలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిరంతరం ఒడుదొడుకులకు లోనయ్యే స్టాక్మార్కెట్లో రాణించే దిశగా మహిళలకు ఆర్థిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఆర్థిక వ్యవస్థలో మరింత సమ్మిళిత వాతావరణం నెలకొనేలా చూడాలి. ఆర్థిక సలహాదారులు మహిళలను చూసే దృష్టికోణంలో మార్పు తీసుకురావాలి. మెంటార్షిప్, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పించాలి. ఈ రంగంలో సాటి మహిళలు సాధించిన విజయాలను గురించి వారికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. అలా విద్య, పరిశోధన, నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించడమే ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ రంగాల్లో విజయాలకు కీలకపాత్ర పోషిస్తుంది. అయితే, మార్కెట్ గురించి సరిగ్గా తెలుసుకోలేకపోతే మాత్రం సరిగ్గా వ్యాపారం చేయలేరు అనేది గుర్తుంచుకోవాలి.
మహిళలకు ఆర్థిక అంశాల్లో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ విషయంలో పురుషులు కూడా సహకరించాలి. ఆర్థిక లక్ష్యాలు పెట్టుకునేలా ట్రేడింగ్‌లో మహిళల క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. చివరగా… ఆర్థిక ప్రపంచం అందరిది. కాబట్టి ఈ రంగంలో మహిళలు వెనకడుగు వేయాల్సిన పనిలేదు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

