ఏ కూర వండినా సరే చివరలో కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. కొత్తిమీరను చిన్నగా కోసి, కర్రీపై చల్లితే అందంగా కనిపిస్తుంది. కేవలం కర్రీ అందంగా కనిపించడానికి, రుచి కోసం మాత్రమే కొత్తిమీరను వాడతారని అనుకుంటే పొరపాటే.. ప్రతిరోజు కొత్తిమీర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు హైబీపీ, గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి కొత్తిమీర తినడం వల్లే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం..
అధిక రక్తపోటు క్రమంగా టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. అదే కొత్తిమీర తినడం వల్ల బీపీ తగ్గుతుంది. రక్తంలోని చక్కెరస్థాయులను తగ్గించడంలోనూ కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలోనూ కొత్తిమీర దోహదపడుతుంది.
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరకణాలను కాపాడుతాయి. కొత్తిమీరలో ఎలోమోల్, కాంఫార్, బొర్నెవోల్,కార్వోన్, క్వుర్సేటివ్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా కాపాడతాయి.
కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వును తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వును పెంచుతుంది. అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచడంతో పాటు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించడం వల్ల హృద్రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ పార్కిన్సన్, ఆల్జీమర్స్ వంటి వ్యాధులు మెదడు పనితీరును దెబ్బతీస్తుంటాయి. అయితే కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు మనలోని యాంగ్జైటీని తగ్గిస్తాయి. అలాగే నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
కొత్తిమీరను ప్రతిరోజు తినడం వల్ల పేగులు శుభ్రమవుతాయి. దీంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు కొత్తిమీరను రోజూ తినడం మంచిది.
కొత్తిమీరలో యాంటీమైక్రోబయాల్ కాంపౌండ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆహార కల్తీ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. కొత్తిమీరలోని డోడెసెనాల్ అనే పదార్థం బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ నుంచి మనల్ని రక్షిస్తుంది.
చర్మంపై దద్దుర్లు, మొటిమలు, గాయాల మచ్చల నివారణకు కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో మేలు చేస్తాయి. కణాల డ్యామేజీని తగ్గిస్తాయి. ముఖ్యంగా పిల్లల చర్మ సంరక్షణలో కొత్తిమీర ఎంతో కీలకం.
కొత్తిమీరలో ఉండే విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్‌లు దృష్టిలోపాలను నియంత్రిస్తాయి. కంటి మీద ఒత్తిడి తగ్గిస్తాయి. కాబట్టి కొత్తిమీర తినడం వల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కొత్తిమీరలో ఉండే కాల్షియం, ఇతర మినరల్స్ ఎముకలను బలంగా చేస్తాయి. బోన్ రీగ్రోత్కు దోహదం చేస్తాయి.