వయ్యారాల లతలు సింగారాల పూలుగా విరిసినట్టు కనిపిస్తున్న ఈ సిగనగ ధగధగలు ప్రకృతికాంత సొగసుల్ని ఆవిష్కరిస్తున్నాయి. జడను ముడిగా వేసి బన్ను పెట్టడం పరిపాటే కానీ, దాని చుట్టూ సూర్యకిరణాల్ని తలపిస్తూ వికసించిన నగ సొబగులు సరిసాటి లేనంత చిత్రంగా దర్శనమిస్తున్నాయి. ఇత్తడి, రాగి లోహాల మిశ్రమంగా పసిడిపూతతో ముస్తాబైన ఈ హెయిర్ బన్ హైదరాబాదీ డిజైనర్ కావ్య పొట్లూరి కలెక్షన్లోనిది.