అడ్రెస్ మారుతుందోచ్!
దుస్తుల విషయంలో అమ్మాయిలు మరింత సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. తమకు నచ్చేవి-నప్పేవి కొనుగోలు చేసేందుకు.. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా వెతికేస్తున్నారు. ముఖ్యంగా దుస్తుల దుకాణాల్లో పురుషుల విభాగాన్ని అస్సలు వదలడం లేదు. అంతేకాదు, ఒత్తిడి లేని షాపింగ్ అనుభవాన్ని పొందాలని భావించినప్పుడల్లా.. పురుషుల విభాగంలోనే షాపింగ్ చేస్తామని చాలామంది అమ్మాయిలు చెబుతున్నారు.
అమ్మాయిల షాపింగ్ అ‘డ్రెస్’ మారుతున్నది. చీరలు, చుడీదార్లను కాదని.. టీస్, హూడీస్, షర్టులను ఇష్టపడేవారి సంఖ్య పెరుగుతున్నది. వీటికోసం దుకాణాల్లో తెగ వెతికేస్తుండటంతో.. పురుషుల విభాగం కిటకిటలాడుతున్నది.
దుస్తుల విషయంలో అమ్మాయిలు మరింత సౌకర్యాన్ని కోరుకుంటున్నారు. తమకు నచ్చేవి-నప్పేవి కొనుగోలు చేసేందుకు.. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా వెతికేస్తున్నారు. ముఖ్యంగా దుస్తుల దుకాణాల్లో పురుషుల విభాగాన్ని అస్సలు వదలడం లేదు. అంతేకాదు, ఒత్తిడి లేని షాపింగ్ అనుభవాన్ని పొందాలని భావించినప్పుడల్లా.. పురుషుల విభాగంలోనే షాపింగ్ చేస్తామని చాలామంది అమ్మాయిలు చెబుతున్నారు. ఆఫీస్ కోసం ఫార్మల్ డ్రెస్ కావాలన్నా.. అబ్బాయిల బ్రాండ్స్‌నే కోరుకుంటున్నామని అంటున్నారు. కొన్ని లేడీస్ స్పెషల్ బ్రాండ్ల ఫిటింగ్స్లో తేడాలు కనిపిస్తుంటాయనీ, దాంతో ప్రతిరోజూ ఫిటెడ్ షర్ట్స్ ధరించాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఫీలవుతున్నారు. అందుకు బదులుగా.. వదులుగా ఉండే అబ్బాయిల కాలర్ షర్టులను సౌకర్యంగా వాడుకుంటున్నామని కాలరెగరేసి మరీ చెబుతున్నారు. కాలేజీ అమ్మాయిలు కూడా.. బటన్లు ఉండే హూడీలు, కూల్ టీ షర్టులను కోరుకుంటున్నారు. ఇక వ్యాయామం కోసం ఉపయోగించే షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్‌ను కూడా మగవాళ్ల బ్రాండ్స్‌లోనే చూసుకుంటున్నారు. మహిళలతో పోలిస్తే.. పురుషుల అథ్లెటిక్స్ కలెక్షన్ మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం. పురుషుల షార్ట్స్, ట్రాక్ ప్యాంట్స్ ప్యాకెట్స్‌తో వస్తాయి. మహిళల దుస్తులలో చాలా బ్రాండ్లు ఇప్పటికీ ప్యాకెట్స్‌ను అందించడం లేదని అతివలు వాపోతున్నారు. వీటితోపాటు బటన్ డౌన్ షర్టులు, లాంగ్ టీ షర్టులు, హూడీలు, స్వెట్షర్టుల్లోనూ అబ్బాయిల కలెక్షన్ నుంచి తీసుకుంటున్న అమ్మాయిలు పెరుగుతుండటం విశేషం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

