Friendship | తనను పిలవలేదని నా ఫ్రెండ్ ఫోన్ తీయడం మానేసింది.. మా బంధం నిలుపుకునే మార్గం చెప్పండి
Friendship | నాకు ఓ స్నేహితురాలు ఉంది. చాలా మంచిది. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. కష్టసుఖాలు తనతోనే చెప్పుకొంటాను. నేను ప్రేమలో పడిన విషయం కూడా తనకే ముందుగా చెప్పాను. నా ప్రేమ విజయవంతం కావడంలో తన సహకారం ఎంతో ఉంది.
Friendship | నాకు ఓ స్నేహితురాలు ఉంది. చాలా మంచిది. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. కష్టసుఖాలు తనతోనే చెప్పుకొంటాను. నేను ప్రేమలో పడిన విషయం కూడా తనకే ముందుగా చెప్పాను. నా ప్రేమ విజయవంతం కావడంలో తన సహకారం ఎంతో ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా.. నా భర్త వైపు పెద్దలు నిరాడంబరంగా వివాహం జరిపించాలని నిర్ణయించారు. దీంతో దగ్గరి బంధువులను మాత్రమే ఆహ్వానించాం. ఆమెతోపాటు స్నేహితులెవరినీ పిలవలేదు. దీంతో నొచ్చుకున్నట్టు ఉంది. అప్పటి నుంచీ నా ఫోన్ తీయడం లేదు. మెసేజ్లకు సమాధానమూ ఇవ్వడం లేదు. ఇలా జరగకుండా ఉండాల్సిందేమో అనిపిస్తున్నది. ఆ స్నేహ బంధాన్ని నిలుపుకొనే మార్గం చెప్పండి ప్లీజ్!
– ఓ సోదరి
స్నేహం.. బంధుత్వాలకు అతీతమైన బంధం. రక్త సంబంధం కన్నా బలమైంది. అందులోనూ ఆమె మీ ప్రేమ విజయానికి కారకురాలు. నలుగురిలో ఒకరిగా జమకట్టకుండా ఉండాల్సింది. అత్తింటివారిని ఒప్పించి అయినా పిలవాల్సింది. పిలవకపోయినా ఫర్వాలేదు. పెళ్లికి ముందు ఒక్కసారి తనను కలిసి పరిస్థితుల్ని వివరించాల్సింది. తను తప్పక అర్థం చేసుకునేది. కారణం ఏమైతేనేం, మీరు పొరపాటుగా వ్యవహరించారు. ఆమె మనసును గాయపరిచారు. క్షమాపణలు అడగడం తప్పించి మరో పరిష్కారం లేదు. నేరుగా ఆమె ఇంటికి వెళ్లండి. తను తప్పక క్షమిస్తుంది. కాకపోతే కొంత సమయం పట్టవచ్చు. ఓ బంధాన్ని నిలుపుకోవడానికి ఆ మాత్రం శ్రమించక తప్పదు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- corona
- Friend
- friendship
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

