గ్రీన్ సిల్క్ ఇక్కత్ వస్త్రంతో డిజైన్ చేసిన జాకెట్‌తో ఈ అమ్మాయి గ్లామర్ రాకెట్లా దూసుకుపోయింది. అందులోనూ, మెడలో గవ్వల హారం వేసుకుని..గోరింక కోసం ఎదురుచూస్తున్న గువ్వలా కనిపిస్తున్నది. చష్మాతో కొత్త చరిష్మా తోడైంది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ అస్మిత మార్వ ప్రాణంపోసిన వైవిధ్యమైన డిజైన్ ఇది.